ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాలల్లో కోవిడ్-19 నిబంధనలు పాటించని వైనం – AISF

AP 39TV 12ఏప్రిల్ 2021:

గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాలల్లో కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా విద్యా సంస్థల యజమానులు తరగతులు నిర్వహిస్తున్నారు. అటువంటి పాఠశాలలు,కళాశాలలు పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శేఖన్నకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జి చిరంజీవి, నియోజవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా మహమ్మారి తో అతలాకుతలం అవుతుంటే గుంతకల్ పట్టణం లొ ఏ మాత్రం కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా విద్యాసంస్థలు నిర్వహించడం జరుగుతుంది. మాస్కులు లేకుండా,బౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్ వాడకుండా, త్రాగడానికి మంచినీళ్లు ఏర్పాటు చేయకుండా,ఒకే గదిలో 70 మంది 80 మంది విద్యార్థులను కూర్చోబెట్టడం ,మరుగుదొడ్లు అపరిశుభ్రంగా పెట్టడం వంటి వి చేస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.వెంటనే అటువంటి పాఠశాలలు కళాశాలల పై చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష ఆర్గనైజింగ్ కార్యదర్శులు శ్యాంసుందర్,కృష్ణ, సహాయ కార్యదర్శులు విశ్వ, రాఘవ, వీరేంద్ర,మదన్, ప్రేమ్, యశ్వంత్,నవీన్, చంద్ర తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

 

 

 

Comments (0)
Add Comment