న్యూ ఇయర్ వస్తుందంటే జనంలో సందడే సందడి
డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మేల్కొంటారు.
విందులు డ్యాన్స్ లతో ఎంజాయ్ చేస్తారు.
జనవరి 1వ తేది ప్రవేశంతో పరస్పరం..
విష్ యు హెప్పి న్యూ ఇయర్..
అంటూ పరస్పరం సంతోషంగా చెప్పుకుంటారు.
365 రోజులకు ఒక్కసారి వచ్చే న్యూ ఇయర్ కోసం చాలా రోజుల నుంచి నిరిక్షీస్తుంటారు జనం.
న్యూ ఇయర్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
న్యూ ఇయర్ లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
ఇది వరకు ఉన్న చెడు వ్యసనాలకు స్వస్తీ పలుకుతారు.
న్యూ ఇయర్ రాగానే ఒకప్పుడు స్వయంగా వెళ్లి
‘‘విష్ యు హెప్పి న్యూ ఇయర్’’
అంటూ చెప్పి స్వీట్స్ ఇచ్చే వారు.
కానీ.. కలియుగం నుంచి కంప్యూటర్ యుగంలోకి ప్రయాణం చేస్తున్నందున వాట్సాప్..
ఇన్ స్టాగ్రాం.. ఫేస్ బుక్ ట్విట్టర్ వేధికగా..
‘‘విష్ యు హెప్పి న్యూ ఇయర్’’
మెస్సెజ్ పంపి చేతులు దులుపు కుంటున్నారు.
డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి ‘‘విష్ యు హెప్పి న్యూ ఇయర్’’ లు మెస్సెజ్ లు వస్తునే ఉంటాయి.
మంచి మాట
లోకంలో ఉన్న చీకటంతా
ఒక్కటైనా అగ్గిపుల్ల
వెలుగును దాచలేదు
మన లక్ష్యానికి
ఆత్మవిశ్వాసం,కృషి తోడైతే
*మన విజయాన్ని *
ఎవ్వరూ ఆపలేరు
మన సమస్యలకు పరిష్కారం
కేవలం మన దగ్గరే ఉంటుంది
ఎదుటివాళ్ళు వద్ద
సూచనలు సలహాలు
మాత్రమే ఉంటాయి.
– వయ్యామ్మెస్ ఉదయశ్రీ