నూతన సంవత్సర స్నేహం – కవిత్వం

ఈ నూతన సంవత్సరం లో
అన్నీ గమనిస్తూ గ్రహిస్తూ…
మనుష్యులలోని నిజమైన తత్వాన్ని…
నిజమైన మార్మికతను…
మనుసులలోని వెతలను…
సమాజంలోని కథలను…
వెలుగులోకి తీసుకురావాలి !!…

కలం పట్టిన ప్రతి వ్యక్తి
కవి కాదు కదా!!…
గళమున్నా వ్యక్తి గాయకుగాడు కాదు
హలం పట్టిన ప్రతి ఒక్కరు
రైతు కాదు కదా!!…
హలం కలం గళం కలిస్తేనే దళం…!!

భద్రత కరువైన ఆర్ద్రత ఉంది!!…
పరితపిదాం …పరిశోదిదాం !!…
పరిశీలిదాం …ప్రకాశిదాం !!…
మనో నేత్రంతో మెరుగులు దిద్దుదాం !!..

అనంత అగాధపు
అంతు చూడాలి !!…
విచక్షణతో మలుపులను సరిచేసి…
ఆత్మీయతకు దారులు వేద్దాం!! ..
అనురాగానికి అరుగులు కడతాదాం !!…
మానవత్వానికి పునాది వేద్దాం !!…

అత్యున్నత ఆదర్శాల
తలుపులు తెరిచి…
ప్రతి వ్యక్తి హృదయాన్ని తట్టి
మానవీయతకు ప్రాణం పోసి…
కాపలాగా సమాజం అంచుల దగ్గర…
కంచెగా నిలబడుద్దాం!!…

భావోద్వేగాలకు లొంగక…
ఎలాంటి ఒత్తిళ్లకు క్రుంగక..
వ్యక్తిత్వాన్ని విడువక…
మన శక్తినంతా ఈ సమాజానికే
ధారబోదాం .ఇది నిజం…
ముమ్మాటికీ నిజం!!..
కొత్తపాతల బేధమేంచగా పంచుదాం స్నేహాన్ని

“అందరికి ఆంగ్ల సంవత్సరా శుభాకాంక్షలు ”

అంబటి నారాయణ
నిర్మల్, 9849326801

new-year-friendship-poetry
Comments (0)
Add Comment