AP 39TV 27ఫిబ్రవరి 2021:
రాయదుర్గం పట్టణ సమీపంలోని భక్తుల పాలిటి కొంగు బంగారంగా వెదజల్లుతున్న శ్రీ విప్ర మలై లక్ష్మీ నవ నార సింహ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.రాయదుర్గం మండలంలోని మల్లాపురం పంచాయతీ పరిధిలో కొండల్లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా ఆంధ్ర కర్ణాటక నుండి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈరోజు కన్నుల పండువగా బ్రహ్మ రథం కదిలింది. ఈ రథోత్సవంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ పుణ్యక్షేత్ర వివరాల్లోకి వెళితే లక్ష్మినరసింహస్వామి ప్రసిద్ధి చెంది కోరిన కోరికలు తీర్చే ఆరాధ్యదైవంగా కొలువబడుతున్న రాయదుర్గం నుండి 5 కిలోమీటర్లు మల్లాపురం కొండల్లో కొలువుదీరిన నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా జరగడం ఆనవాయితీ చారిత్రాత్మక పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్న శ్రీ విప్ర మలై లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తులు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు.
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.