National Girls’ Day జాతీయ బాలికల దినోత్సవం

National Girls’ Day

జాతీయ బాలికల దినోత్సవం

ఆడపిల్లంటే అపురూప సంపద

కేర్ మన్న నీ స్వరం
వేదమంత్రమై చేరినప్పడే
నీతోపాటు నేనూ పుట్టాను

తెల్లనికాంతి పరిచ్ఛేదమై
ఏడురంగులు చిమ్మినట్లు
సింగిడేసిన ఎద
సీతాకోకై ఎగిరింది

రెండు చేతులా పట్టి
ఎదపై పొదువుకున్న క్షణం
ఏకమైన గుండెలస్పందన
అనునాద గీతమయింది

నా గుండెమీదనేర్చిన
తొలి అడుగులిప్పుడు
అత్తింటివైపు కదులుతుంటే
గూడు దిగులు రంగేసుకుంటది

రెక్కలొచ్చి నీవు డాలర్ల
వేటకు ఎగిరిపోతే
గుండె నల్లమబ్బు
పులుముకుంటది

చిట్టి తల్లీ..
నువ్వు యాదికొస్తే
దుఃఖపు సంద్రమై పొంగడంలో
ఈ నాన్నెప్పుడూ
గూబురు మీసాలున్న అమ్మే!!

(నేడు బాలల దినోత్సవం)

తుల శ్రీ నివాస్

National Girls' Day /zindhagi.com / yatakarla mallesh / tula sreenivas
Comments (0)
Add Comment