టాలీవుడ్ హీరో నాగశౌర్య ఫాంహౌస్‌లో జూదం కేసులో కీల‌క వివ‌రాలు రాబ‌ట్టిన పోలీసులు

హైద‌రాబాద్ శివారులోని మంచిరేవులలో టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి లీజుకు తీసుకున్న ఫాంహౌస్ లో కొంద‌రు జూదం నిర్వ‌హిస్తుండ‌గా ఇటీవ‌ల పోలీసులు దాడులు చేసిన‌ విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన నిందితుడు గుత్తా సుమ‌న్‌ను అరెస్టు చేసి, పోలీసులు విచారించారు. అత‌డి కస్టడీ విచారణ ముగియ‌డంతో ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

కస్టడీ స‌మయంలో నార్సింగి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. నిందితుడి వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా పలు ప్రశ్నలు వేసి, సమాచారాన్ని రాబట్టారు. ఏయే ప్రాంతాల్లో క్యాసినోలు నిర్వహించారో ఆరా తీశారు. ఫాంహౌస్‌లతో సుమన్‌కు ఉన్న లింకుల గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్ లోనే కాకుండా గోవా, శ్రీలంకలో కూడా క్యాసినోలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో త్వరలో మరికొందరిని పోలీసులు ప్ర‌శ్నించనున్న‌ట్లు తెలుస్తోంది.
Tags: Naga Shaurya, Farm House Case, Crime News, Hyderabad, Police

Comments (0)
Add Comment