My self-loathing
నా_ఆత్మఘోష
పసిబిడ్డ ఆత్మఘోష
మాయమాటలకు లొంగిపోయావు
ప్రేమలోకంలో మునిగిపోయావు
గర్భవతిగా మిగిలిపోయావు
నమ్మకంగా గొంతు కోశాడు
అబార్షన్ కు డబ్బివ్వబోయాడు
ప్రేమోన్మాదం ఆమె నాశనానికి పునాదై
పులికి చిక్కిన జింకలా
మానవమృగాల కబంధ హస్తాలలో
ప్రేమ కరాళనృత్యం చేసింది
తనువు రాబందులకు ఆహారమయింది
చెవిటివాడి ముందు శంఖం మోతలా
మానవత్వం లేని ప్రేమోన్మాదుల మధ్ మనసు విలవిలలాడి
కన్నవారి పరువు మంట కలిపావు
అర్థరాత్రి వేళ విడిచావు
ట్యాంకు బండ్ కు చేరుకున్నావు
తనువు చాలించాలనుకున్నావు
అమ్మా అన్న పిలుపు విన్నావు
నీ ప్రయత్నం ఆపుకున్నావు
నీ ఒడిలో నిద్ర పుచ్చలేవా?
ఈ లోకాన్ని నాకు చూపించలేవా?
నీవు చేసిన తప్పుకు నా కెందుకమ్మ శిక్ష
అర్థంచేసుకో ఇది నా ఆత్మ ఘోష
✍ శ్రీ శ్రీకాంత్