Must read – must grow చదవాలి – ఎదగాలి

Must read – must grow

చదవాలి – ఎదగాలి

చదవాలి ఎదగాలి
చదువుతూ ఎదగాలి
ఎదుగుతూ ఒదగాలి
చదువే మన ప్రపంచం
చదువే మన సర్వస్వం

చదువు లేకపోతే మనం లేము
చదువే మనమన్నట్టు చదవాలి
మనం చదవాలి ప్రపంచాన్ని చదివించాలి
చదువు మన గుండెలోని ప్రాణవాయువు

చదువును నలుగురికి పంచు
నిజమైన సమాజ సంస్కారాన్ని పెంచు
చదువుతో అజ్ఞానాంధకారాన్ని తుంచు
చదివి జ్ఞానివై అజ్ఞానం వృక్షం వెళ్ళను పెకిలించు

చదివితే విజ్ఞానం చదవకపోతే అజ్ఞానం
చదువే మన ప్రయాణం చదువే మన ప్రమాణం చదవకపోతే మన జీవితం అగాధం
చదివి కొలువు సాధిస్తే మన జీవితం సుఖాంతం

(పుస్తకాలే మన స్నేహితులు చదువే మన కన్నతల్లి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మనం ఉండే ఇండ్లు పెన్నులే మనం పట్టిన గన్నులు అక్షరాలే అవి పేల్చే తూటాలు చదువుతో జ్ఞాన సముపార్జననే మన జీవితం, మనం సంపాదించే జీతం)

రచన : సాయి త్రివిక్రమ్

Must read - must grow / zindhagi.com /ambedkar / yatakarla mallesh
Comments (0)
Add Comment