Mudiraj is a soulful amalgamation of employees
ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మెళనం
విద్య. ఉపాధి, ఉద్యోగం కోసం..
(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)
ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ లైఫ్ వారిది. అయినా వారిలో ఏదో నిరాశ. హృదయంలో ఎక్కడో కలుక్కుమనే నొప్పి.. కారణం..? ప్రభుత్వ కొలువు చేస్తూ కుటుంభానికి పరిమితమైన తాము పుట్టిన ముదిరాజ్ జాతి కోసం ఏదో చేయాలనే ఆరాటం.
ముదిరాజ్ సభ అనగానే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు ఉంటారనే గదా మీ అనుమానం.. నో.. నో.. పొలిటికల్ వాసనకు దూరంగా స్వచ్ఛమైన వాతవరణంలో సభను నిర్వహించారు.
ఎక్సైజ్ సీఐ వెంకటేశ్ ఒక్కరి ఆలోచనకు పది మంది మద్దతు ఇచ్చారు. మరో వంద మంది మేము సైతం సై.. సైసై.. అన్నారు. అంతే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలోని దేవి హోటల్ లో ఆదివారం జరిగిన ‘‘ ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మెళనం’’ రేపటి ముదిరాజ్ బిడ్డల భవిష్యత్ కు మార్గ దర్శకం చూపింది.
ఒక్కోక్కరు తన మనసులోని మాటను అందరితో షేర్ చేసుకున్నారు. పేరుకు కులంలో ’రాజ్‘ ఉన్న మన జాతి బతుకులు దుర్లభంగా ఉన్నాయని బాధ పడ్డారు. కారణం విశ్లేషించారు. స్వాతంత్ర్యం సిద్దించి ఏడున్నర దశాబ్దాలు గడిచిన మన బతుకులలో వెలుగులు వెదజల్లక పోవడానికి కారణాలను ఆన్వేషించారు.
విద్యతోనే ఇల్లు.. కుటుంబం.. కులం ముదిరాజ్ జాతి అంతా బాగుంటుందన్నారు పెద్దలు. అందుకు పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్ ముదిరాజ్ కుటుంబంను సాక్ష్యాంగా చూయించారు.
ఆ సుభాష్ చంద్రబోస్ కుటుంబంలో ఆర్డీవో.. కమర్షియల్ ఆఫీసర్.. డిఎస్పీ ఇలా ఒకే కుటుంబంలో ఎనిమిది గురు గెజిటెడ్ ఆఫీసర్ లు ఉన్నారు.
అందుకు కారణం..???
చదువు.. ఆ చదువుతోనే ఫార్వార్డ్ ఫ్యామిలీలకు తాము ఎందులో తక్కువ కాదని నిరూపించారు సుభాష్ చంద్రబోస్ కుటుంబం. ఆ సభలోని వారంతా ఆలోచనలో పడ్డారు. నిజమే.. చద్రబోస్ కుటుంబంలా మన ముదిరాజ్ జాతి అంతా చదువుకుంటే దర్జాగా బతుకచ్చు. అందుకు తాము ఏమి చేయాలి..? ఏమి చేస్తే బాగుంటుంది..??
‘అభ్యర్థించు.. ప్రశ్నించు.. సాధించు’ ఈ సూత్రంతో ముదిరాజ్ సమాజం కోసం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని నిర్ణయించారు.
పౌరుషం.. కోపం.. మన ముదిరాజ్ డిఎన్ ఎ లో ఉంది. ఇక ముందు పేరు వెనుక ప్రతి ఒక్కరు ‘ముదిరాజ్’ అని చెప్పు కోవాలి. కాల్ చేస్తే మన జాతి వారైతే… ‘జై ముదిరాజ్’ అంటూ పలుకరించాలని కోరాకు కొందరు.
ప్రభుత్వ ఉద్యోగులుగా పొలిటికల్ లీడర్ లా మాట్లాడద్దు. అది చట్ట విరుద్దం కూడా. మరీ. మనం ఏమి చేస్తే బాగుంటుంది. ఇదే ఆలోచనలతో స్పీచ్ లు ఇచ్చారు చాలా మంది పెద్దలు.
చదువు తోనే సమాజంలో మార్పు వస్తోందనడానికి ఘనపురం మల్లేష్ తన జీవితంలో అనుభవించిన కన్నీటి కథలను వేధికపై షేర్ చేసుకుంటే ఔరా.. అనుకున్నారు.
పదేళ్ల వయసులో దొర వద్ద పాలేరుగా పని చేసిన మల్లేష్ ‘చదువు’ కోసం ఇంట్లో కొట్లాడి పిహెచ్ డి వరకు చదివాడు. ఇప్పుడు అతను సిద్దిపేట్ జిల్లాలోని ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ ముదిరాజ్ జాతికోసం పని చేస్తున్నారు.
అక్షరం ముక్క రాని అయ్యా.. అవ్వ చదువు వద్దని చెప్పినా.. పార్ట్ టైమ్ పని చేసి పిహెచ్ డి వరకు సర్కార్ చదువు చదివాడు ఘనపురం మల్లేష్. అందుకు అతనికి అయిన మొత్తం ఖర్చు అక్షరాల ఇరువై ఎనిమిది వందలే.. నమ్మడం లేదా ఇది నిజం. నేటి యువతకు అతని జీవితం ఆధర్శం.
విద్య.. ఉపాధి.. ఉద్యోగం ఈ మూడింటిలో మన ముదిరాజ్ జాతి ముందుండం కోసం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం సహాకరించాలని నిర్ణయించారు. నిరాశ నిస్పృహలతో తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి వేయబడుతున్న ఆంశాలపై ఆద్యాయనం చేయాలని చర్చించారు.
వంద మందితో ప్రారంభమైన ’ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెళనం‘ మళ్లీ జరిగే సభకు ఒక్కోక్కరు పది మందిని తీసుకు వస్తే ఆ వెయ్యి మందికి అయ్యే ఖర్చుతాను పెట్టుకుంటానని బహిరంగంగా ప్రకటించారు పోలీసు అధికారి సుభాష్ చంద్రబోస్.
ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ పండుగ ప్రభాకర్ ‘ముదిరాజ్ జెండా’పై ఆవేశంతో పాడిన పాట అందరిని ఆకర్శించింది.
ఈ వేధికపై ప్రభుత్వ హైకోర్టు ప్లీడర్ పాండు గారిని ముదిరాజ్ పెద్దలు సన్మానించారు. ఈ సమావేశంలో పెద్దలు DSP. ఆదినారాయణ ముదిరాజ్ సిఐలు వెంకటేష్ ముదిరాజ్, సుభాష్ చంద్రబోస్ ముదిరాజ్, నర్సింగరావు ముదిరాజ్, యాటకర్ల మల్లేష్ ముదిరాజ్ (జర్నలిస్ట్) సురేష్ ముదిరాజ్, బి.విఠల్ ముదిరాజ్, గుండ్ల పల్లి శ్రీనివాస్ ముదిరాజ్, అల్లుడు జగన్ ముదిరాజ్, ఘనపురం మల్లేష్ ముదిరాజ్, యువ మిత్రులు సురేందర్ ముదిరాజ్ తుర్క మహేష్ ముదిరాజ్, వెంకట రమణ ముదిరాజ్ లతో పాటు వంద మంది పాల్గొన్నారు.
జై ముదిరాజ్.. జైజై ముదిరాజ్… అంటూ ప్రొఫెసర్ ఘనపురం మల్లేష్ సభలో ఉన్నవారందరితో నినాదాలు చేయించారు. ఇగోతో ఉన్న ఉద్యోగులు కూడా పిడికిలి బిగించి ‘జై ముదిరాజు’ నినాదం చేశారు.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
949 222 5111