ఏపీ39టీవీ న్యూస్ ఏప్రిల్ 4
గుడిబండ:- మండలంలోని శంకరగల్లు రాళ్లపల్లి జంబల బండ గ్రామాలలో వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బి.శివకుమార్ కర్ణాకర్ గౌడ్ కొంకల్లు శివకుమార్ సింగల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జై రామప్ప సర్పంచులు ఎంపీటీసీ అభ్యర్థి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో మాజీ జెడ్పిటిసి జీవి శివకుమార్ మాట్లాడుతూ గుడిబండ మండలం లో ప్రస్తుత జడ్పిటిసి అభ్యర్థి భూతరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని గుడిబండ అంటే వైఎస్ఆర్సీపీకి వెన్నెముక లాంటిది అని నిరూపించుకో వలసిందిగా ప్రజలను కోరారు భూత రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రిని కొనియాడారు మరియు మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర చెరువుకు నీళ్లు తేవడం మరియు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వెన్నంటే ఉండి ప్రజా సేవ చేసే భాగ్యం నాకు కల్పించడం నా పుణ్యం అన్నారు నాకు గురువారం జరగబోయే ఎన్నికల్లో ఉదయం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించ వలసిందిగా సవినయంగా కోరుతున్నాను అని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో లో గుడిబండ మాజీ జెడ్పిటిసి జిల్లా కార్యదర్శి జి.బి. శివ కుమార్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొంకల్లు శివకుమార్ మరియు నూతన సర్పంచులు జి.బి.కర్ణాకర్ గౌడ్ డి ఎల్ వై గౌడ లక్ష్మీనారాయణ జమ్మల బండ సర్పంచ్ లక్ష్మమ్మ వైయస్సార్ సిపి నాయకులు అనంతరాజు శివరాజ్ పాండు దాసరపల్లి చిట్టయ్య కొంకల్లు మహా లింగప్ప కొంకల్లు ఎంపీటీసీ అభ్యర్థి కరియన్న తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ