భారీ మొత్తంలో విరాళం అందించిన ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది

అనంతపూర్ లైవ్ న్యూస్
జూన్ 9
గుదిబండ :-మడకశిర మండలం ఇన్చార్జి ఎంపీడీవో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ దేశంలోని స్వచ్ఛంద సంస్థలు (ఆర్డిటి సంస్థ) ,ప్రజలలో మానవత్వం బయటికి వస్తోంది.స్థానిక పట్టణంలోని మడకశిర ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది స్పందించు సాయం అందించు అనే నినాదంలో భాగంగా స్థానిక మండల పరిధిలోని సర్పంచులతో సమావేశమై అందరి ద్వారా విరాళాలు స్వీకరించి బుధవారం ఆర్డీటీ సంస్థ కు లక్షా పదహారు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయల (116496)భారీ మొత్తాన్ని ఆర్ డి టి సంస్థకు స్థానిక ఎంపీడీవో నరేంద్రకుమార్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా మడకశిర ఇంచార్జ్ ఎంపీడీఓ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎదుటి వారి కష్టాన్ని తమ కష్టంగా మార్చుకున్నప్పుడే నిజమైన మానవత్వం బయటకు వస్తుందని తెలిపారు.కారోన కష్టకాలంలో వైద్య పరికరాల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వానికి సాయం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయం అందించారని మున్ముందు కూడా ఇదే విధమైన ఐక్యమత్యం చూపించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు. సహాయం అందించిన సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు ప్రజాపరిషత్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. మరియు ఆర్డిటి సంస్థకు ఈ విరాళం పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆర్డిటి సంస్థ రీజినల్ డైరెక్టర్ మడకశిర ఎంపీడీవో నరేంద్ర కుమార్ కు సర్పంచులకు గ్రామ కార్యదర్శులకు సంస్థ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
ఆర్సి ఇంచార్జ్
మడకశిర

Comments (0)
Add Comment