Mother cycling with children
పిల్లలతో తల్లి సైకిల్ పై బతుకు బాట…
లేకపోవడం అనే సౌభాగ్యం గురించి
ఎంత చెప్పుకున్నా తక్కువే
తగ్గించు కోవడం అనే సౌకర్యం గురించి
ఎంత రాసుకున్న తక్కువే.
కలిగివున్న సంపన్న దేశాలతో
పోల్చుకునే దేశం గురించి కాదు గానీ,
కలిగివున్న మనుషులతో మనలని పోల్చుకు న్నప్పుడు లెక్కలేని అసౌకర్యాలు కలుగుతాయి.
అలా అలా..
మనమ్ రకరకాల అడ్డదారులు తొక్కి
అవినీతి కూపంలో మగ్గి అన్ని రకాలుగా చెడిపోయి,
బ్యాంకులని ముంచి ఇతర దేశాల్లో తిని తొంగుని, మూడ్ వచ్చినప్పుడు దేశభక్తి పాఠాలు చెప్పి,
వీలైతే డబ్బులు సంపాదించడం ఎలా
అనే పుస్తకాలు రాసి, ఫోజులు కొట్టి చచ్చిపోవచ్చు కానీ
లేకపోవడం లోని,
లేకపోయిన మనుషుల్లోని ఆనందాన్ని మాత్రం అవలోకిస్తే
మన జ్ఞానం బురద పైన నీటిలా
తేట పడుతుంది.
వేదాంతం చెబుతూ మనుషుల మధ్య గీతలు గీసే వాళ్ళు
ఉపనిషత్తులు చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు
మాఫియా దొంగ డబ్బు ఆశ్రమాల్లో దాస్తూ భక్తిని ప్రచారం చేసే వాళ్ళు
దేశంలో అకారణ గౌరవం పొందుతున్నప్పుడు మట్టి మనుషులు ఇవేవీ పట్టించుకోకుండా దేశానికి గౌరవం ఇస్తూ
అట్లా బతుకుని వెళ్లదీస్తుంటారు. సంస్కృతి, సాహిత్యం, భాష, సంప్రదాయాలు వాళ్ళ చల్లని చూపు కోసం పాకులాడుతూ ఉంటాయి.
రవి కుమార్ నూకతోటి
ఫేస్ బుక్ నుంచి.. Photo curtecy : Mahanty Venkata Rao