- కిడ్నాప్..
MLA Kidnapped By Naxalights -04
ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్
నేను నక్సల్స్ చెరలో ఉన్న బంధీని.. నిరాయుధుణ్ణి. నాకు స్వేచ్ఛ లేదు.. నక్సల్స్ చెప్పింది వినాలి.. చెరలో ఉన్న ఎమ్మెల్యేను. ఇలాంటి సంఘనటలు నా జీవితంలో ఎదురైతాదని ఎప్పుడూ ఊహించలేదు.. నాన వెంకట్రామయ్యకు కమ్యూనిష్టు రాజకీయాలతో సంబంధం ఉంది. ఈ బూర్జువ రాజకీయాలంటే నాకు అసహ్యమే.. విద్యార్ధి దశలో కూడా నేను రాజకీయాలకు, ఉద్యమాలకు దూరంగా ఉన్నాను.
ఎన్టీఆర్ పై నమ్మకంతో
కానీ.. ఎన్టీఆర్ పై నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చాను.. ఎమ్మెల్యేను అవుతానని ఏ రోజు అనుకోలేదు. పరిస్థితులు అనుకులించి ఐదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాను.. ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్యేగా గెలిశాను. నన్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుదామని వచ్చాను.. నక్సల్స్ తమ అనుచరులను విడిపించుకోవడానికి నన్ను కిడ్నాప్ చేసారు. ఒకవేళ ప్రభుత్వం నక్సల్స్ షరతులను అంగీకరించక పోతే.. జైల్లో ఉన్న నక్సల్స్ ను రిలీజ్ చేయనట్లయితే నాకు మల్హాల్ రావుకు పట్టిన గతే పడుతుందా..?’’ ఇలా ఆలోచనలు రాగానే నాలో ఆందోళన పెరుగుతుంది.
‘‘జైల్లో ఉన్న నక్సల్స్ రిలీజ్ చేస్తారా.. లేదా..? ఒకవేళ చేయక పోతే నేను మరో ఇరువై నాలుగు గంటలే బతుకుతానా..? ’’ నాలో వస్తున్న సందేహలను కూడా నక్సల్స్ ను అడుగలేని పరిస్థితి.
‘‘పుట్టిన మనిషికి చావు తప్పదు.. ఆ చావు అనుకోని అతిథిగా వస్తే ఏ టెన్షన్ ఉండదు..
కానీ.. నా చావు కళ్ల ముందు కనబడుతుంది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఎలా స్పందిస్తారో.. ఎమో..’’ అడవిలో నక్సల్స్ తో నడుస్తున్నాను కానీ.. నా ఆలోచనలు ఆగడం లేవు.
ఉదయం పద కొండు గంటకు నన్ను నక్సల్స్ కిడ్నాప్ చేసారు..
మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ కు ఇవ్వుమని రఘువీరరెడ్డికి లేఖ ఇచ్చారు.
ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల ముప్పయి నిముషాలు అవుతుంది. MLA Kidnapped By Naxalights -04
‘‘నడువడం అవాటు లేదా.. కాళ్లు నొప్పులు పెడుతున్నాయా..? అదిగో.. ఆ కనిపించే చిన్న గుట్టపైన కూర్చుందాం.. అక్కడ కూర్చుంటే శతృవు కదలికలు మనకు కనిపిస్తుంటాయి. ఎలాగైన నడువు..’’ అన్నాడు దళ కమాండర్.
మరో పది నిముషాలలో అతి కష్టం మీద ఆ గుట్టపైకి ఎక్కాము.
దళ సభ్యులు రోజు అలవాటులాగే తమ వద్ద ఉన్న మందు పాతరలను కొంత దూరంలో ఆమర్చారు. పోలీసులు దగ్గరకు వస్తే ఆ గుట్టపై నుంచి విద్యుత్ వైర్ల ఆధారంగా మందుపాతరలు పేల్చడానికి దళ సభ్యుడు సిద్దంగా ఉన్నాడు. మరో దళ సభ్యుడు చెట్టు ఎక్కి సెంట్రీ చేస్తున్నాడు.
దళ కమాండర్ ప్రసాద్ చేతికి ఉన్న డిజిటల్ వాచ్ క్లిక్.. క్లిక్.. ఆరు సార్లు మోగింది.
‘‘అగో.. అప్పుడే.. ఆరు గంటలైందా..?’’ అనుకుని తన బ్యాగ్ లోనుంచి చిన్న రేడియో తీసి స్టార్ట్ చేసాడు దళ కమాండర్..
‘‘ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.. వార్తలు చదువుతుంది శాంతి స్వరూప్..
డిచ్పల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావును కిడ్నాప్ చేసిన నక్సల్స్.. జైల్లో ఉన్న తమ ఐదుగురు అనుచరులను 24 గంటల్లో రిలీజ్ చేయానట్లయితే ఖతం చేస్తామని హెచ్చరిక..’’
ఇంకొన్ని ప్రధాన వార్తలను చదివాడు న్యూస్ రీడర్.. ఆ తరువాత..
‘‘నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ప్రాజెక్ట్ రామడుగు గ్రామంలో శనివారం 23న ఉదయం 11 గంటకు ఐదుగురు సభ్యులు గల నక్సల్స్ సాయుధ దళం డిచ్పల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావును కిడ్నాప్ చేశారు.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిసిన మండవ నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంలో బాగంగా రామడుగు గ్రామానికి వెళ్లిన సందర్బంలో నక్సల్స్ కిడ్నాప్ చేశారు. MLA Kidnapped By Naxalights -04
ఎమ్మెల్యేను ఖతం చేస్తాం
జైల్లో ఉన్న ఐదుగురు నక్సల్స్ ను 24 గంటల్లో రిలీజ్ చేయనట్లయితే ఎమ్మెల్యేను ఖతం చేస్తామని కలెక్టర్ కు పంపిన లేఖలో హెచ్చరించారు నక్సల్స్.. అతి ఉత్సహంతో తమ షరతులను నిర్లక్ష్యం చేసి పోలీసు గాలింపు చర్యలు చేపడితే బంధీగా ఉన్న ఎమ్మెల్యే ప్రాణాలకు ప్రమాదమని మరిచి పోవద్దని నక్సల్స్ హెచ్చరించారు.
అయితే.. ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావు కిడ్నాప్ విషయంపై స్పందించిన ప్రభుత్వం మాత్రం నక్సల్స్ డిమాండ్ లను పరిశీలిస్తున్నామని పేర్కొంది. తొందరపడి కిడ్నాప్ అయిన ఎమ్మెల్యేకు ప్రాణ హాని తపెట్టవద్దని మానవత్వంతో విడుద చేయాలని విజ్ఞప్తి చేసింది.
రేడియో స్విచ్ ఆఫ్ చేసాడు దళ కమాండర్ ప్రసాద్.
‘‘ఎమ్మెల్యే గారు..! వార్తలు విన్నావు గదా.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందంటావు..?’’ దళ కమాండర్ మొదటి సారి ఎమ్మెల్యేగా సంబోదించాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మౌణంగా ఉన్నాను. ఇంకా నన్ను ఏమి అడుగలేక పోయాడు ప్రసాద్.
కానీ.. నాకు మాత్రం నా చావు కళ్ల ముందు కనిపిస్తోంది.
నేను బతుకాంటే.. మూడు మార్గలున్నాయి..
మొదటిది నక్సల్స్ స్వయంగా నన్ను క్షేమంగా ఇంటికి పంపించాలి..
జైల్లో ఉన్న తమ అనుచరును విడిపించుకోకుండా అలా నన్ను విడుద చేయలేరు నక్సల్స్..
రెండవది నక్సల్స్ కళ్లు గప్పి అడవిలో నుంచి తప్పించుకుని పారి పోవాలి..
నేను చావునైన ఆహ్వనిస్తాను.. కానీ.. నక్సల్స్ నుంచి తప్పించుకోవాలనే ఆలోచన చేయలేదు..
మూడవది పోలీసు బలగాలు దాడులు చేసి నన్ను నక్సల్స్ చెరనుంచి విడిపించాలి..
ఒకవేళ అలా చేస్తే బంధిగా ఉన్న నన్ను అడ్డు పెట్టుకుని నక్సల్స్ పోలీసులపై కాల్పులు జరుపుతారు. ఇరువురి కాల్పుల మధ్య నేను ప్రాణాలు కోల్పొతాను..
కానీ.. ఈ మూడు కూడా సాధ్యం కావు అనిపించింది..
పుట్టిన మనిషికి చావు తప్పదు.. ఎక్సిడెంటులోనో.. హత్యకు గురైతెనో.. ఆనారోగ్యంతోనో కూడా చావు తప్పదు..
కానీ.. ఏ తప్పు చేయకుండానే నక్సల్స్ చేతిలో చావ బోతున్నాను అనుకున్నాను..
ఆ క్షణంలో నాకు గడిసిన నా జీవితం, కుటుంబ నేపద్యం కళ్ల ముందు సినీమా రీులా తిరిగింది. MLA Kidnapped By Naxalights -04
(చావు తప్పదని టెన్షన్ కు గురవుతున్న ఎమ్మెల్యేకు జాతీకి రత్నాలైన అల్లూరి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఎందుకు గుర్తుకు వచ్చారు.. రేపటి వరకు ఎదురు చూడాల్సిందే..)