క్యాన్సర్‌ ఆస్పత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే అనంత

AP 39TV 05 మే 2021:

అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ రోడ్డులో ఉన్న ప్రభుత్వ కోవిడ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని మంగళవారం రాత్రి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పరిశీలించారు. ఈ ఆస్పత్రిలో కోవిడ్‌తో చికిత్స పొందుతున్న నలుగురు వ్యక్తులు ఆక్సిజన్‌ అందక మృతి చెందినట్లు తెలియడంతో హుటాహుటిన ఎమ్మెల్యే ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అని తెలుసుకున్నారు. కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాలో ఎక్కడా సమస్యలు లేకుండా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. ఎక్కడైనా సమస్య ఉంటే తక్షణం అలారం మోగేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

 

Comments (0)
Add Comment