* Middle class dream …… !! *మధ్యతరగతి కల……!!

*మధ్యతరగతి కల……!!

రాత్రి నిద్రలో జారుకుందునా
కలల కాసారంలో ఒకటే మునక
ఒక కల అలలా ఎగిశాక….
వెనకనే మరో కల
ఒక దాని కింద మరొకటి
చల్లగా జారుకుంటూ…..
అవ్యక్తానంద సందోహం
తుషార బిందువులై….
జ్ఞాపకాల పొరలు
ఒక్కొక్కటీ చిరిగి చేటంతై
భళ్లున మేలుకుంటే…‌
కళ్లముందు …………
బతుకు పుస్తకంలో..
అన్నీ అచ్చు తప్పులే!!

Abdul Rajahussen writer

…*ఎ.రజాహుస్సేన్, కవి

Middle class dream/zindhagi.com
Comments (0)
Add Comment