మెపా (MEPA) అంటే ‘ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం’ విద్య – ఉపాధి లక్ష్యంగా ముదిరాజ్ జాతీ కోసం పని చేస్తోంది. విద్యావంతులైన కొందరి ఆలోచన నుంచి పుట్టిందే ఈ మెపా..
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్ లు జారీ చేస్తున్న విషయం విధితమే. ముదిరాజ్ ఎంప్లాయిస్ నుంచి విరాళాలు సేకరించి ముదిరాజ్ అభ్యర్థులకు కావాల్సిన మెటిరియల్స్ అంద చేసి పలువురికి జాబ్ రావడానికి కృషి చేసింది మెపా.
ఇగో.. ఇప్పుడు సిద్దిపేట్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టైమ్ పిఆర్ వో వారి సౌజన్యంతో మెఘా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట్ లోని న్యూ జనరేషన్ జూనియర్ కాలేజ్ లో ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళాను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. మెపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, మెపా రాష్ట్ర కార్యదర్శి పులి దేవేందర్ పాల్గొంటున్నారు.
“MEPA లక్ష్యం”
విద్య ఉద్యోగ సాధికారత సాధన లో భాగంగా ముదిరాజ్ విద్యార్థులను ఉద్యోగార్థులను చేయడమే..ఆ దిశగా అడుగులు వేస్తున్న సిద్దిపేట జిల్లా అధ్యక్షులు – పిట్ల ఆంజనేయులు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి – నాయిని కృష్ణ ముదిరాజ్ & ఉపాధ్యక్షులు బుస్స నరేష్ ముదిరాజ్ , గాడి చెర్ల సతీష్ కుమార్ ముదిరాజ్ & జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు
త్వరలో అన్ని జిల్లాలో జాబ్ మేళా లు నిర్వహించడానికి వివిధ కంపెనీలతో మెపా రాష్ట్ర కమిటీ మాట్లాడుతుందన్నారు మెపా సభ్యులు.
ఈ అవకాశాన్ని ముదిరాజ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వారు.