రాయల్ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఉత్సాహంగా పాల్గొన్న యువత . రాయల్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సోమవారం అనంతపురం నగరంలోని మాస్టర్ మైండ్స్ డిగ్రీ కాలేజీ ఆవరణలో నందు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈసందర్భంగా అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ రాయల్ యూత్ వ్యవస్థాపకులు J.L. మురళీధర్ మాట్లాడుతూ కొవిడ్ 19 సెకండ్ వే వ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రి రెడ్ క్రాస్ సొసైటీ లో రక్త నిల్వలు పూర్తిగా తగ్గిపోయి సకాలంలో రక్తం అందక ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకొని తక్షణమే రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి వాషింగ్ మిషన్ డ్రైవ్ ఈ పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రక్తదానంపై యువతలో చైతన్యం తీసుకొచ్చి వారిని రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాయల్ యూత్ సొసైటీ ప్రగతి పథం యువజన సంఘం పిలుపుమేరకు జిల్లాలోని యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. *ఈ రక్తదాన శిబిరంలో 40 మంది యువకులు రక్తదానం చేశారు. వీరికి అతిధుల చేతులమీదుగా రక్త దాతలకు ప్రశంసా పత్రాలు అంద చేయడం జరిగినది. ఈ రక్తాన్ని శస్త్ర చికిత్సలు చేయించుకునే వారికి గర్భవతులకు ప్రమాదంలో గాయపడిన వారికి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేయడం జరుగుతుo ది . ఈ కార్యక్రమంలో రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు సుంకర రమేష్ ప్రగతి పథం సంస్థ అధ్యక్షులు భరత్ NYK డి డి ఓ శ్రీనివాసులు తోట నాగరాజు సొసైటీ సభ్యులు రాయల్ సునీల్, మిథున్, గంగాద్రి, అబ్దుల్, శైలు, హరినాథ్, సుబ్బు, విజయసాయి, రెడ్క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.