జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ని కలిసిన – అప్ప రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ పిల్లా చంద్రం

AP 39TV 15 ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అప్ప రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ పిల్లా చంద్రం తో కలిసి అనంతపురం జిల్లా కమిటీ గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ని కలవడం జరిగింది. ఇందులో అనంతపురం జిల్లాలో బాలయోగి గురుకుల పాఠశాలలో జరుగుతున్న అన్ని విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగినది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు అన్ని గురుకుల పాఠశాలలో అక్కడే పనిచేస్తున్న సిబ్బంది కొంతమంది మరియు ఇతర సిబ్బంది కలిసి నిత్యావసర సరకులు బయటకు తీసుకెళ్తున్నారని పేరెంట్స్ కమిటీ దృష్టికి రావడంతో ఈ విషయాలు కూడా కలెక్టర్ తో సుదీర్ఘంగా చర్చించడం జరిగినది. అదేవిధంగా స్కూళ్లలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ పేద విద్యార్థులకు కడుపుల కొడుతున్నారని కాంట్రాక్టర్ల విషయాలు కూడా కలెక్టర్తో చర్చించడం జరిగింది ముఖ్యంగా టెండర్ లో అగ్రిమెంట్ లో ఉన్న విధంగా పంపిణీ చేయకుండా నాణ్యతలేని సరుకులు పంపిణీ చేస్తున్నారని ఆ విషయాలు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాంట్రాక్టర్ల పేర్లు సుబ్రహ్మణ్యం శెట్టి, సురేష్ శెట్టి, చంద్రశేఖరయ్య ఈ కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఆయా స్కూల్ ని తనిఖీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అప్ప రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీ పిల్ల చంద్రం, అనంతపూర్ జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు బంగి ఓబుళపతి, జిల్లా జనరల్ సెక్రెటరీ కురుగుంట గోవిందు, జిల్లా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొనడం జరిగినది.

 

 

Comments (0)
Add Comment