కరోనా మహ్మరి పేరుతో వింత పెళ్లి పత్రికలు

 సోషల్ మీడియాలో వైరల్..

పెళ్లి పత్రికలు చూసి నవ్వుతున్న జనం

కరోనా.. ఒకప్పుడు ఈ పేరు వింటెనే ప్రాణ భయంతో ఇంట్లోనే సెల్ఫ్ క్యారంటైన్ అయ్యేవారు. ఇండియాలో ఇప్పుడు ఆ కరోనా కంట్రోల్ కావడంతో వింతగా, విచిత్రంగా కరోనా పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2019లో చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా మహ్మరి ప్రపంచాన్ని వణికించిన విషాధ సంఘటనలు మనలను అతలకుతలం చేసినవి. కరోనా మహ్మరికి మన స్నేహితులో.. బంధువులో బలైన సంఘటలు ఎన్నో..

అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకున్న కఠిన ఆంక్షలు ఆ కరోనాను తరిమి కొట్టాయి.

అయితే.. ఇప్పుడు కరోనా చైనాలో మరో రూపంలో పరుగులు తీస్తూ ప్రపంచంపైకి వస్తుందనే వార్త కథనాలతో ఆ కరోనాపై జోక్ లు వేస్తున్నారు. ఇటీవల పెళ్లి పత్రికల పేరుతో ఆ కరోనా గురించి వ్యాంగ్యంగా రాయడం ఇందుకు ఉదాహరణ..

 శ్రీ వినాయక రమేష్ ఆఫ్ సెట్, భీమ్ గల్ వారు ప్రింట్ చేసిన ‘‘కరోనా వారి పెళ్లి పిలుపు’’ కార్డు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కరోనా వారి పెండ్లి పిలుపు

మా దేశ అదృష్ట పుత్రుడు

వరుడు: ది కరోనా MBBS, FRCS

వధువు: చి.ల.సౌ. మిగిలిన దేశాల ప్రజలు.

వివాహ మహోత్సవము జరుపుటకు కాలము నిర్ణయించబడినది

సుముహూర్తం:

స్వస్తిశ్రీ చైనా మానేన శ్రీ కరోనా నామ సం॥ర కరోనా నక్షత్రయుక్త కరోనాలగ్న పుష్కరాంశ గడియ (కరోనా స్పెడ్ అవుతున్నంతకాలం

కళ్యాణవేదిక.

క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డులు

విందు

3 టానిక్ సిసాలు, 2 గోళీలు

ఆహ్వానించువారు: చైనా దేశా ప్రజలు

-బంధువులు:-

పెద్దనాన్న ఇటలీ,

చిన్న నాన్న ప్రాన్స్

పెద్దమ్మ: స్పెయిన్, చిన్నమ్మ: ఇరాన్ మామయ్య: ఇంగ్లాండ్ 209 దేశాల బంధుమిత్రుల అభినందనలతో…,

ముఖ్య అతిథి: అమెరికా

విన్నపము. మూతికి గుడ్డకట్టి, సానిటైజర్ చేతబట్టి, కళ్యాణవేదిక నందు సామాజిక దూరం పాటిస్తూ తమ చేతలతో కరోనా ని ఆశీర్వదించగలరు.

ముద్రణ: శ్రీ వినాయక రమేష్ ఆఫ్సెట్, భీమ్ గల్

కరోనా కాలంలో కూతురు మల్లిక పెళ్లి చేసిన జర్నలిస్ట్ యాటకర్ల మల్లేష్ ప్రింట్ చేసిన ‘‘కరోనా కాలంలో కళ్యాణం’’ అనే వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా పోస్టర్ ను మరిపించే విధంగా ప్రింట్ చేసిన ఆ కార్డుపై వధువు మల్లిక- వరుడు మనోజ్ కుమార్ ఫోటోలు హీరో-హీరోహిన్ లా ఆ కార్డుపై ప్రింట్ చేశారు.

ఆ పెళ్లికి ఆర్థిక సహాయం చేసిన మానస గణేష్, మామిడి నారాయణ, కాంతి గంగారెడ్డి, మైదం మహేశ్వర్ లు నిర్మాతలుగా పేర్కోన్నారు.

యాటకర్ల మల్లేష్ దర్శకత్వం, సహ దర్శకులు యాటకర్ల ఉదయ్ కిరణ్, స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే కే.చంద్రశేఖర్ (కేసీఆర్), సలహాదారులు సయ్యద్ ఇస్మాయిల్, సమర్పణ యాటకర్ల లలిత,

సహాకారం డాక్టర్ మధు శేఖర్, యాటకర్ల శంకర్, గడ్డం శ్రీధర్ రెడ్డి, అనంత్ రెడ్డి, కుందేళ్ల వెంకటేశ్, వేముల రమేష్ పేర్లు ఉన్నాయి.

ఉదయ్ క్రియేషన్స్ వారు నిర్మించే ఈ చిత్రం 13 ఆగష్టు 2020 నాడు ఉదయం 11 గంటల 15 నిముషాలకు హైదరాబాద్ లోని మణికొండలో గల శివాలయంలో విడుదల అవుతుందని ఆ కరోనా పెళ్లి పత్రికలో పేర్కొన్నారు. ఈ కరోనా పెళ్లి పత్రిక డిజైనర్ అరేయ్ యెంకటి.

 – మారబోయిన మాన్విక్ రుద్ర

marriage-magazines-in-the-name-of-corona-virus-thewidenews-com / maraboina manoj kumar / yatakarla mallesh / mallika marriege wedding card/ manasa ganesh
Comments (0)
Add Comment