Manishi ..you are obvious (poetry)
మనిషీ .. నువ్వో అవ్యక్తం..!!
కొన్ని క్షణాలు అవ్యక్తంగానే
గడిచిపోతుంటాయి అలా…
క్యాలెండర్లో పేజీలు తెలీకుండానే
చిరిగిపోతుంటాయి ఏదోలా ….
ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య
కాలం కరిగిపోతుంటుంది ఇలా …
దివారాత్రాలు కూడబలుక్కొని
సంసారం చేసేస్తుంటాయి అలా…
గాలీ పరాగరేణువుల అన్యపరాగబంధం
పూలజన్మకు కారణమవుతాయి మరోలా…
ఏదైనా..ఏవైనా..అన్నీ అవ్యక్తాలే
కాలం కడలిలో కలిసిపోతాయి
ఎలాగోఅలా……!!
ఓ మనిషీ !నువ్వుకూడా
ఓ అవ్యక్త స్వరూపానివే..!
నువ్వూ ఎప్పటికైనా…
కాలం కౌగిలిలో
కరిగిపోవాల్సినోడివే..
కలిసిపోవాల్సినోడివే..!!
Manishi ..you are obvious (poetry)