బందును జయప్రదం చేయండి, బైక్ ర్యాలీ నిర్వహించిన -కార్మిక,విద్యార్థి,యువజన సంఘాలు

AP 39TV 03మార్చ్ 2021:

మార్చి 5 న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని బుధవారం నాడు ఏ ఐ టి యు సి, ఏఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఏ ఐ వై ఎఫ్ కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి బందును జయప్రదం చేయాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి, ఏఐఎస్ఎఫ్, ఏ ఐ వై ఎఫ్,టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజారెడ్డి, మనోహర్, సంతోష్, ధనంజయ,లు మాట్లాడుతూ ఈనెల 5న జరిగే బందులో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలన్న  నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలపై బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత మోసాలను తిప్పికొడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయకుండా, ఇప్పటికే ఏపీ ప్రజలను నట్టేట ముంచేసి మరల రాష్ట్రంలోని అతి పెద్ద సంస్థ, రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే సహించేది లేదన్నారు. అనేకమంది ప్రాణత్యాగాలు మరియు పోరాట త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ జోలికి వస్తే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రజల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఇప్పటికైనా బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చూడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యక్ష ఆందోళనలో భాగం కావాలని,రాష్ట్రంలోని ఎంపీలు,ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నగర అధ్యక్ష కార్యదర్శులు వి కే కృష్ణుడు, రాజేష్ గౌడ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటప్ప, పరశురాం, సాకే వీరా, ఏఐఎస్ఎఫ్ నాయకులు నగర కార్యదర్శి రమణయ్య, మోహన్, హరి,ఈశ్వర్,మంజు, ప్రజయ్, ఏఐవైఎఫ్ నాయకులు విజయ్,దేవా,రుద్ర, ఏ ఐ టి యు సి నాయకులు రాజు,అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment