Mahaprasthana of Bapu dolls-12 బాపు బొమ్మల మహాప్రస్థానం-12

Mahaprasthana of Bapu dolls-12

బాపు బొమ్మల మహాప్రస్థానం-12
సంధ్యా సమస్యలు…!!

తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్,బహిర్ యుద్ధంరావమే కవిత్వమంటాడు చలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని అధికారుల్నివూగించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలంటే చెలానికి అంత ఇష్టం‌..!! ఈ కవితలో ఓ సాయం సంధ్యలో వివిధ రకాల మనుషులు వాళ్ళ మనస్తత్వాలు, రుచులు,అభిరుచులు ఎలా వుంటాయి. పరిస్థితుల ప్రాబల్యంతో వాళ్ళేమో చేస్తారన్న ఓ లాజిక్ తో ఈ కవితను రాశారు శ్రీ శ్రీ.

విద్యార్ధిది పైలా పచ్చీసు దశ.ఉద్యోగికి ఆర్థిక వెసులు బాటు ఉంటుంది కాబట్టి‌ బయటి రుచులు ఆస్వాదిస్తుంటాడు. ఇక సంసారి బాధల ప్రపంచంలో,బాధ్యత బరువుతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవాలా? లేక ఇంకదైనా ప్రత్యామ్నాయ మార్గముందా? అని ప్రశ్నించుకునే మనస్తత్వం సంసారిది. లో “ఆ సాయంత్రం రాక్సీలో నార్మా షేరర్ బ్రాడ్వేలో కాంచన మాల! ఎటకేగుటో సమస్య తగిలిం
దొక విద్యార్ధికి ! Mahaprasthana of Bapu dolls-12

ఉడిపీ శ్రీకృష్ణ విలాస్ లో అటు చూస్తే బాదం హల్వాఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఎంచుకొనే సమస్య కలిగిం
దొక ఉద్యోగికి !

ఆ సాయంత్రం ఇటు చూస్తే అప్పుల వాళ్ళు అటు చూస్తే బిడ్డల ఆకలి! ఉరిపోసుకు చనిపోవడమో,
సమస్యగా ఘనీ భవించింవొక సాంసారికి..!

శ్రీశ్రీ…(1939 ?)

విద్యార్ధి,ఉద్యోగి,సంసారి అనే మూడు రకాల మనుషుల్ని తీసుకున్నారు. మనుషుల్ని బట్టే వారి సమస్య
లున్నూ!!
బాపు బొమ్మకు బ్నిం వివరణ..!! సమస్యలు ఒక్కొక్కరికీ ఒక్కో రకం. తీరని సమస్యలు. తెలియని సమస్యలు.ఏవి తీర్చుకోవాలో తేలని సమస్యలు. ఎలా తీర్చుకోవాలో తెగని సమస్యలు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో సమస్య. ఆకాశం ఎర్రబడ్డ కొద్దీ పగలంతా తెలియని కష్టానికి తగిన ఫలితం దొరకని సంధ్యా సాయంత్రపు సమస్యలు. ఎలా కావాలో ఘనీభవించిన సంసారి సమస్యలు. బాపు గారు శృంగార తార అమెరికన్ నటి నార్మా షేరర్ గ్లామర్ ని లైఫ్ సైజ్ పోస్టర్చేసి సామాన్యుడికి కొత్త సమస్య తెచ్చి పెట్టారు. Mahaprasthana of Bapu dolls-12

అలా కలగా సమస్యలు మరచి మరో పొద్దు ఎదుర్కోవెలసిన సమస్యల్ని మెరుగు పరచడం,ఈ బొమ్మలో
కనిపించిన పరిష్కారం. (బ్నిం)

ఎ.రజాహుస్సేన్
హైదరాబాద్

Mahaprasthana of Bapu dolls-12 /zindhagi.com /abdul Rajahussen / Yatakarla mallesh
Comments (0)
Add Comment