Mahaprasthana of Bapu dolls-10 బాపు బొమ్మల మహాప్రస్థానం-10

Mahaprasthana of Bapu dolls-10
బాపు బొమ్మల మహాప్రస్థానం-10

Mahaprasthana of Bapu dolls-7 బాపు బొమ్మల మహాప్రస్థానం-7

మిథ్యావాది…!!

“మాయంటావా ? అంతా
మిధ్య ఉంటావా?
నా ముద్దుల వేదాంతీ ?
ఏమంటావు? మాయంటావూ ?

కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరపు,స్వప్నం,ని
శ్శబ్దం, ఇది మాయ ! మాయ !
మాయంటావూ ! అంతా!
మిధ్యంటావూ?

జమీందారు రోల్సు కారు
మాయంటావూ? బాబూ
ఏమంటావు?

మహారాజు మనీపర్సు
మాయంటావూ? బాబూ
ఏమంటావు?

మరఫిరంగి, విషవాయువు
మాయంటావూ?స్వామీ
ఏమంటావు?

పాలి కాపు నుదుటి చెమట
కూలివాని గుండె చెరువు
బిచ్చగాడి కడుపు కరువు
మాయంటావూ?

తుపానులూ, భూకంపం,
తిరుగు బాట్లు, సంగ్రామం,
సంగ్రామం , సంగ్రామం
మాయంటావూ,ఏయ్
ఏమంటావు?

జగతి మరపు,స్వప్నం,ని
శ్శబ్దం, ఇది
మాయ,!మాయ,!మాయ,!మాయ!
మాయ,! మాయ!
మాయంటావూ? అంతా
మిధ్యంటావూ…” !!

Mahaprasthana of Bapu dolls-7 బాపు బొమ్మల మహాప్రస్థానం-7

శ్రీశ్రీ…1937

ఈ కవిత ఎప్పుడు చదివినా శ్రీశ్రీ గారి గురించి పురిపండా చెప్పిమాటే గుర్తొస్తుంటుంది. అదేమంటే? 

“కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను అది శ్రీశ్రీ లా వెలిగింది…” (పురిపండా) వర్తమాన సమాజ వాస్తవ స్థితిని గుర్తించలేని , దోపిడి దారులను, పెట్టుబడిదారులనూ సమర్థించే మాయా వాదాన్ని ఖండించాడు శ్రీశ్రీ. పాలి కాపు నుదుటి చెమట కూలివాని గుండె చెరువు బిచ్చగాడి కడుపు కరువును పెట్టుబడిదారుడు మాయంటాడు. జగమే ఒక మిధ్య. ఇదో కొత్త వేదాంతం. పెట్టుబడి దారీ సమాజంలో వాస్తవాలకు మిధ్యా పూత. తుపానులు మిధ్యే.‌ భూకంపము మిధ్యే. ఇక తిరుగు బాట్లు, సంగ్రామం కూడా మిధ్యే. వాస్తవాన్ని అబధ్ధం అని ప్రచారం చేయడం ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించడం ఇందులో చూడొచ్చు…!! Mahaprasthana of Bapu dolls-10 

Mahaprasthana of Bapu dolls-7 బాపు బొమ్మల మహాప్రస్థానం-7

బాపు బొమ్మకు ‘ బ్నిం ‘ వివరణ..!!

వాస్తవాన్ని అసత్యం అని ప్రచారం చేస్తూ..ధనజీవికి, శ్రమజీవికి మధ్య వున్న వ్యత్యాసాన్ని ‘ మాయ ‘ అనే ప్రపంచా నీతిని ప్రస్తావించారు శ్రీశ్రీ. నీ ఆకలి మాయ నీ పేదరికం మిథ్య. నీ అన్నం బొచ్చె నీ కళ్ళముందే కాకెత్తుకొని పోవడం భగవంతుడి లీల, మహాత్యం.
ఈ కవితలో బాపు గారు భగవంతుని మాయగా భావించి బొమ్మ చూపించారు..’ అంటారు బ్నిం.!! Mahaprasthana of Bapu dolls-10

ఎ.రజాహుస్సేన్
హైదరాబాద్…!!

Mahaprasthana of Bapu dolls-10/zindhagi.com /abdul rajahussen / yatakarla mallesh
Comments (0)
Add Comment