వైయస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం సెప్టెంబర్ 4న 5 వేల మొక్కలు నాటే కార్యక్రమం

  • కోడిమి జర్నలిస్ట్ కాలనీలో 5 వేల మొక్కలు నాటే కార్యక్రమం
  • జర్నలిస్టులకు covid-19 ప్రత్యేక హాస్పిటల్ కేటాయించినందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకి అభినందనలు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, (APJDS) ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం కోడిమి జర్నలిస్ట్ కాలనీలో సెప్టెంబర్ 4వ తేదీన వైయస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి వెల్లడించారు. అనంతపురం నగరంలోని R&B గెస్ట్ హౌస్ నందు ఈరోజు విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. వైయస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం కార్యక్రమంలో కోడిమి జర్నలిస్ట్ కాలనీలో 5000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో జర్నలిస్టులు కరోనాతో (covid-19) ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నానని, ఈ స్ఫూర్తితో సీఎం పేరు మీద జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.

అనంతపురం జిల్లాలో జర్నలిస్టుల కోసం అనంతపురం నగరంలోని SVహాస్పిటల్ ను జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడును ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ద్వారా అభినందిస్తున్నానని అన్నారు జర్నలిస్టుల సమస్యల పట్ల కలెక్టర్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని మచ్చా రామలింగారెడ్డి అన్నారు ఇదే స్ఫూర్తితో జర్నలిస్టుల ఇతర సమస్యల పట్ల కూడా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవ చూపాలని సూచించారు. కోడిమి జర్నలిస్ట్ కాలనీలో సెప్టెంబర్ 4,5,6 తారీకు జరిగే వైయస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లాలోని జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, చిన్న పత్రికలు, సబ్ ఎడిటర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు

రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో కోడిమి జర్నలిస్టు కాలనీలో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావడానికి వచ్చిందని RDT మాంచో ఫెర్రర్ సహకారంతో ఇళ్ల నిర్మాణం జరుగుతున్నదని RDT కి అభినందనలు తెలియజేస్తున్నాం అని అన్నారు.  సమావేశంలో విజయరాజు, మారుతి, శివప్రసాద్, ఉదండం చంద్రశేఖర్, బాలు, జానీ, షాకిర్, దామోదర్ రెడ్డి, మల్లికార్జున, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ANDHRA PRADESH JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU DIST. UNIT

Comments (0)
Add Comment