Love between wife and husband
భార్య భర్తల మధ్య ప్రేమ
నెమరువేసుకో
తొలి చూపుల గుసగుసలలో
తొణికిన ఘడియలను ఒక్కొక్కటిగా పేర్చుకో
చిత్రంగా గిరిగీస్తూ సిగ్గు పడిన ముంగురులను
లెఖ్ఖ తప్పకుండ గుర్తు చేసుకో
తుళ్ళి పడిన సొగసు తరంగాలు
తల్లడిల్లిన జాడ మళ్లీ రప్పించుకో
పెళ్ళినాటి ముచ్చట్లను దాచిపెట్టిన
పెదవంచును తట్టిలేపుకో
అరనవ్వుల మధురిమలు ఆరగింపు చేసుకుంటూ
కునుకురాని చూపులు కుస్తీ పట్టిన తీరు
తెరచాటుగ తొంగిచూచు సరదాలను
గలగలమంటూ గాజులు బట్టబయలు చేసిన హోరు
లేతలేత కలలన్నీ పూతపూసి మురిసాయని
సన్నగ సప్పుడుచేస్తూ కనురెప్పలు చెప్పినప్పుడు
అదిరిన అధరాల ఆలింగనాలతో సహా
అన్నీ గుర్తుచేసుకో
అరమోడ్పు కన్నులతో సిగ్గు పడిన
మరుమల్లెల బుగ్గలన్ని ఎరుపెక్కితే
తలవాల్చిన క్షణాలను తరుముకుంటూ
ముందు నువ్వూ..,
వెనుక నేనూ…