పల్లె ముచ్చట్లు
Legion of spiders
రామచిలకల దండు
రా..! రమ్మని..’ పిలిచే..రామచిలకల దండు ‘..!!
37 యేళ్ళ హైదరాబాదు నగరం జీవనంలో రామచిలకల్ని చూసింది లేదు. చెట్టూ చేమలు లేని ఈ జనారణ్యంలో
పాపం! రామచిలకలకు చోటెక్కడుంది.?
రాత్రింబవళ్ళు మోటారు వాహనాలు,రైళ్ళు రణగొణ ధ్వనులతో హోరెత్తేనగరాన్ని చూసి,అల్పజీవులు రామచిలుక
లకు ఠారెత్తడం సహజమే కదా! అయినా హైదరాబాదును ఆక్రమించుకున్న పావురాళ్ళ గుంపుల మధ్య మధ్య రామ
చిలుకలకు చోటెక్కడుంది..!!
ఇప్పుడు…!!
నగరీకరణకు దూరంగా,ఇంకా పచ్చివాసన వీడని పల్లె’నంది వెలుగు'(తెనాలి)కు మారాక రోజూ చిలుకలతోనే సావాసం. చిలుకలతోనే అచ్చట్లు,ముచ్చట్లు. మా ఇంటి పైన పెంట్ హౌస్ వరండాలో నిల్చుంటే రామ చిలుక లొచ్చి పలకరిస్తాయి? “మీ నగరం బాగుందా? మా పల్లె బాగుందా ” ? అన్నట్లుంటుంది వాటి చూపు..!!
“సర్లే మీ నగరం కబుర్లేంటి” ? అని వాటి భాషలో అడుగుతాయి?
వాటి భాష తెలీకున్నా బాడీ లాంగ్వేజ్ ప్రకారం అర్థంచేసుకుంటాను.
“నగరంలో ఏముందమ్మా? దుమ్మూ ధూళి,వాయుకాలుష్యం.రెస్టారెంట్లు, చాయ్ కేఫ్ లో వద్ద నీళ్ళు పుక్కిలించి
పుసుక్కున మంటూ రోడ్లపైనే ఊసేస్తుంటారు. చాయ్ కొప్పు చేతి కందగానే జేబులోంచి సిగరెట్టు తీసి, సిప్పు సిప్పుకీ పొగ వదులుతుంటారు. ఇదేంటని అడిగేవాడు వుండడు. అలా అడిగితే ప్రయోజనం లేకపోగా, పైగా రివర్స్ హ్యామరింగ్. ఈ గోలంతా ఎందుకులే అని నోర్మూసుకుంటా “..అన్నాను.
అంతే…,
రామచిలుకలు ఒక్కసారిగా ఫక్కున నవ్వాయి….!
మీ మనుషులంతా ఇంతే. మీకు మీరే గోతులు తవ్వుకుంటారు.పర్యావరణాన్ని పాడుచేసి,సమాధులు కట్టుకుంటారు. మా పల్లెల్లో అలాకాదు. కాస్త వెనుకా ముందూ ఆలోచిస్తారు. చెట్టూ చేమా పెంచుతారు. మాలాంటి అల్ప జీవులు వాడడానికి వీలుగా ఆకుల్నో, అలముల్నో భద్రం చేస్తారు. మేం జామ చెట్లపొవాలి,దోరకాయల్ని కొరికి,రుచి చూసి నా అస్సలు పట్టించుకోరు. అసలు ఈ చెట్టూ చేమలన్నీ మీ కోసమే అన్నట్టుంటుంది వారి చూపు. సర్లే.. ఇప్పుడు మీరూ వచ్చారుగా మా పల్లెకు మనం మనం ఫ్రెండ్స్.. అంటూ ఫ్రెండ్షిప్ ఆఫర్ చేసి. తుర్ర్.ర్ర్ మని ఎగిరిపోతుంటాయి. రోజూ దాదాపు ఇదే తంతు.
“పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు..” అన్న పాట లీలగా వినబడుతోంది.
ఒట్టు…!
రామ చిలుకలతో మాట్లాడనిదే ఏం తోచదు.!!