Laughter is a wonderful medicine నవ్వు ఓ అద్బుత ఔషధం

Laughter is a wonderful medicine
నవ్వు ఓ అద్బుత ఔషధం

మనం మరిచిపోతున్నాం
మనసుతో వచ్చెనవ్వును
ఆరోగ్యాన్ని ఇచ్చే నవ్వును!!
ఆనందాన్నిచ్చే నవ్వును!!
ఏడవడం నేర్చుకొన్నాం
ఏడిపించడం నేర్చుకొన్నాం!!
బతికించే నవ్వును వదిలేశాము!!

అర్తంకాని ఆలోచనలతో
నిత్యం బాధలను మోస్తున్నాం!!
ఇతరుల మీద మాటల
బాంబులు వేస్తున్నాం!!
ఎవరికి అర్తం కానీ వ్యతలను
తలలోకి నింపుకున్నాం
కపటనవ్వులు నవ్వుతున్నాం
ఆరోగ్యాన్ని కూల్చేస్తాయి!!
ఇతరులను చూసి
వెక్కిరింతల నవ్వులు
మనసును క్రుంగేలా చేస్తాయి!!

నిజమైన నవ్వును
స్వచ్చమైన నవ్వును
ఏనాడో మరిచిపోయాం!!
హృదయంలోనుంచి
వచ్చే నవ్వు కావాలి!!
మనస్ఫూర్తిగా
వచ్చే నవ్వుకావాలి!!

ఇప్పుడు నవ్వులన్నీ
నకిలీమయం!!
కుట్ర కుతంత్రపు నవ్వులు
ఇతరుల కొంపకూల్చే నవ్వులు
నవ్వుతోనే చంపేస్తారు!!
నవ్వుల చూపుతో కాల్చేస్తారు!!
వెతకాలి ఎక్కడ దాచుకున్నామో!!
స్వచ్చమైన నవ్వును??

సకిలింతల నవ్వు వద్దు!!
ఆరోగ్యాన్ని నిలిపే నవ్వే ముద్దు!!
నవ్వుకు నిర్వచనం మారాలి!!
అనిర్వచనమైన ఆనందం నింపాలి!!

ఒకరిది నిజమైన నవ్వు అయితే
మరొకరిది స్వార్థపూరితమైన నవ్వు!!
సమస్తాన్ని దూరంచేసే నవ్వు వద్దు!!
గమనాన్ని గతి తప్పించే నవ్వు వద్దు!!
అనురాగాన్నీ పంచే
నవ్వే ముద్దు!!

నవ్వుతో అందమైన
తీరాలు కనబడాలి!!
దూరాలను దగ్గర చేయాలి!!
ఎక్కడెక్కడో వెతకాలి
అనుకున్నవారితో ప్రేమను
నవ్వులతో పంచుకోవాలి!!

నవ్వినా ఏడ్చినా కళ్ళలో
కన్నీళ్లే వస్తాయి!!
ఒక స్వచ్చమైన నవ్వు అందరి
హృదయాలలో ప్రతిఫలిస్తుండాలి!!
పొంగేదుఃఖాన్ని ఆపగలగాలి!!
పోయే ప్రాణం నిలపాలి!!
ఇదే నిజమైన నవ్వుకు బలం!!

కళ్లల్లో కాంతి నవ్వుల్లో శాంతి!!
హృదయం నిండా ప్రశాంతే!!
కొందరు ఎన్నో బాధలను
లోపల దాచుకొని
బయట నవ్వులను కురిపిస్తారు!!
నవ్వులో దృఢచిత్తం
కార్యదీక్ష నిజమైన క్రమశిక్షణ
కనబడాలి.!!
అప్పుడే నవ్వే నవ్వుకు సార్థకత!!

అంబటి నారాయణ, నిర్మల్
9849326801

Laughter is a wonderful medicine /zindhagi.com / yatakarla mallesh / ambati narayana
Comments (0)
Add Comment