గాలింపు ఆపి తిరిగి రేపు ఉదయానే ప్రారంభిస్తామని చెప్పడంతో ఇంటికి వెల్తున్న మాకు ఓ ఫోన్ వచ్చింది. జలపాతం గుండంలో యువకులు పడ్డప్పుడు కొందరు వీడియో తీశారని సమాచారం. ఎదుటి వారి ప్రాణం పోతున్నప్పుడు వీడియో తీయడమనే విషయంపై సమాజం రకరకాలైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది.. సహాయం చేసి కాపాడే బదులు వీడియో తీసి వినోదాన్ని పొందారనేది అందులో కామన్ గా వ్యక్తమయ్యే అభిప్రాయం.
అలాంటి పరిస్థితుల్లో వీడియో తీయడమనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే కాపాడగలిగే అవకాశం అక్కడున్న పర్యాటకులకు దాదాపు ఉండదు. అతి ప్రమాదకరమైన గుండంలో దూకి తమ ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టివేయడమనేది చెప్పడానికి సులభంగా ఉన్న ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడు మాత్రం చాల కష్టం. దానికి బదులుగా గుండంలోకి దూకకుండా మునిగిపోతున్న వారికి ఏదైన అందించి పైకి లాగడమనేది సాధ్యమైనది. ఆ ప్రయత్నం మాత్రం అక్కడ జరిగింది.
అక్కడున్న అమ్మాయిల చున్నీలను తీసుకుని వారికి అందించే ప్రయత్నం చేశారు కొందరు యువకులు.. కాని వాటిని అందుకునే సమయం కూడ మునిగిపోతున్న యువకులకు ఇవ్వలేదు సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహం. (Kuntala Fall) ఇక వీడియో విషయానికొస్తే కళ్ల ముందు ఏదైన సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సంఘటనను తమ దగ్గర ఉన్న ఫోన్ తో చిత్రీకరించడం మనిషి కి ప్రస్తుతం సహజసిద్ధమైన అలవాటుగా, పరిపాటిగా మారింది.
వీడియో కోసం మళ్లీ జలపాతం వద్దకు చేరుకున్నాం. వీడియో తీసిన వారు అప్పటికే అక్కడి నుండి వెల్లిపోయారు. ఎలాగోలా వారి ఫోన్ నంబర్ లు తెలుసుకున్నాం. వారి నుండి వీడియోలను సేకరించి వార్త పంపించాం. మళ్లీ బ్రేకింగ్ లు ప్రారంభమయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో కావడంతో వార్తకు మరింత ప్రియారిటీ పెరిగింది. ప్రతి బులెటిన్ లో ప్రాధాన్యతనిస్తూ ప్రసారం చేశారు. లైవ్ వీడియోతో నేషనల్ మీడియా సైతం వరుసగా వార్తలను ప్రసారం చేస్తోంది. అప్పటికి సమయం రాత్రి 8 కావొస్తోంది. ఎలాగోలా ఇంటికి చేరుకున్నాం. అలా జులై 2 గడిచిపోయింది.
జలపాతం వద్దకు చేరుకోవాలని…
2017, జులై 3 సోమవారం తెల్లారి లేవగానే సుప్రభాతం లా స్టాఫ్ రిపోర్టర్ ల ఫోన్లు.. కొందరికి మేము వస్తున్నాము సాధ్యమైనంత త్వరగా (Kuntala Falls-05) జలపాతం వద్దకు చేరుకోవాలని ఆదేశాలు అందితే , కొందరికి తొందరగా జలపాతం వద్దకు చేరుకుని అప్డేట్ ఇవ్వాలంటూ ఆదేశాలొచ్చాయి. మళ్లీ హడావుడిగా ఉదయం 7 గంటలకు జలపాతం (Kuntala Fall) వద్దకు చేరుకున్నాం.
ఈ సారి ఆకలితో అలమటించవద్దని ఆలోచించి మొదటగానే అక్కడున్న క్యాంటీన్ లలో టిఫీన్ లు ఆరగించాం. చాలా వరకు ఛానెల్లా స్టాఫ్ రిపోర్టర్లు అప్పటికి జలపాతం వద్దకు చేరుకుని మాక్ లైవ్ లు, పీటుసీలు చేస్తు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండే తెలుగు మీడియా మొత్తం కుంటాల ప్రమాదం పై దృష్టి ని కేంద్రీకరించింది. వరుసగా మాక్ లైవ్ లు, ప్రత్యేక కథనాల ప్రసారం చేస్తోంది.
జసపాతంలో తమకు సంబంధించిన వారు మరణించడం, వారి మృతదేహాలు గంటల వరకు దొరకకపోవడమనే బాధ వర్ణించరానిది. తమ వారు మరణించారనే విషయాన్ని అధిగమించి మృతదేహాలు దొరుకుతాయా అనే సందేహం ఎంతలా క్షోభకు గురిచేస్తుందో మాటల్లో చెప్పలేము. జలపాతం కిందికి చేరుకుని గుండం వద్దకు వెల్లాము. నీటి ప్రవాహం కాస్త తగ్గింది.
యువకుల మృతదేహాల గాలింపు కొరకు ఉదయం 8 గంటలకు సోమన్న నేతృత్వంలోని 12 మంది గజ ఈతగాల్ల బృందం రంగంలోకి దిగింది. గుండంలోతుగా ఉండి గుహను పోలి ఉండడంతో గాలింపు కాస్త కష్టం అవుతోంది. గుండం అడుగుకు చేరుకుని మృతదేహాల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.. గజ ఈతగాల్లు.
( ఆరవ భాగంలో కలుద్దాం.. )
సాయి కిరణ్ జాదవ్, జర్నలిస్ట్
Hello, I’m having trouble trying to change the settings for my facebook account. I use firefox, and when I opened the account I clicked on the button saying I wanted firefox to remember my password info. Well, I’ve now changed my mind and want to remove firefox from remembering my info. Does anyone know how to do this? Please help if you do. Thank You..