పుష్కర కాలం నాటి అభిమానం… పంచుకున్న వేళా…

ప్రజాస్వామ్య ఘట్టంలో ఎన్నికల ప్రక్రియ ప్రజలకు అత్యంత ఆసక్తి. ఇక అభ్యర్థులకైతే చెప్పనక్కర్లేదు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భం నాటి జ్ఞాపకాలను భద్రపర్చుకుని నాటి అనుభవాలను పంచుకుంటుంటారు.. కొంత మంది అభ్యర్థులు ఆ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని ఏదో రూపంలో భద్రపర్చుకుంటే… మరి కొందరు నాటి ఎన్నికల చిత్రాలను భద్రపర్చుకోవడం సర్వ సాధారణం… కాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థి అభిమాని ఎన్నికల నాటి గుర్తును తన వద్ద పదిలపర్చుకుని పుష్కర కాలం తర్వాత తన అభిమాన అభ్యర్థికి ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు.

2009 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కూన శ్రీశైలంగౌడ్ కు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం విధితమే. కాగా నాటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో కూన శ్రీశైలంగౌడ్ కు కేటాయించిన కప్పు సాసర్ గుర్తుతో ముద్రించిన కరపత్రాన్ని ఓ అభిమాని భద్రపర్చుకున్నాడు. ఈ కరపత్రాన్ని 12 ఏళ్ల తర్వాత ఆదివారం రోజు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కు అందచేసి నాటి ఎన్నికల నాటి అనుభూతులు పంచుకున్నారు. తన అభిమాని తనపై దాచుకున్న అభిమానాన్ని చూసి కూన శ్రీశైలంగౌడ్ ఉబ్బితబ్బిబ్బయ్యారు.

Comments (0)
Add Comment