ఏపీ 39టీవీ 27 జనవరి 2021:
శివమొగ్గ జిల్లాలో బ్లాస్టింగ్ ప్రమాదంలో రాయదుర్గంకి చెందిన ముగ్గురుమృతిచెందిన కుటుంబానికి బ్రహ్మీని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా రెడ్ క్రాస్ జిల్లా చైర్ పర్సన్ కాపు భారతి , ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మూడు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు చొప్పున మూడు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చెక్ అందించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు. చెక్ లను మృతుల కుటుంబాలకు అందించి, కుటుంబసభ్యులను పరామర్శించి, ఆ కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారం కోసం కర్ణాటక శివమొగ్గ జిల్లా కలెక్టర్ (డీసీ )తో మాట్లాడడం జరిగింది అని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలియజేసారు. మూడు కుటుంబాల నష్టపరిహారం కోసం అవసమైతే కర్ణాటక ముఖ్యమంత్రి B.S.యడ్యూరప్ప గారిని కలిసి వారితో కూడా మాట్లాడి మూడు కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని YSR భీమా వచ్చేటట్టుగా చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. 30 వ వార్డులో నివాసముండు గొల్ల పవన్ (29) కుటుంబసభ్యులకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు అని ఎమ్మెల్యే తో మొరపెట్టుకోవడంతో వారి కుటుంబం కోసం స్థలం ఇల్లు మంజూరు చేసే విదంగా 30 వార్డు ఇంచార్జ్ గోరంట్ల సత్యనారాయణ కి తెలియజేసారు.తాసిల్దార్ రోడ్డు మసీద్ పక్కన మృతుడు మహమ్మద్ జావీద్ (26) కుటుంబాన్ని పరామర్శించి వారికి ఒక లక్ష రూపాయల చెక్కను అందించిన కాపు రామచంద్రారెడ్డి , మృతుడి కుటుంబసభ్యులు ముసలివారు కావడంతో వారి బాగోగులు చూసుకోవాలని 26వ వార్డు ఇంచార్జ్ ఫకృద్దీన్ కి తెలియజేశారు. మురుడి గ్రామానికి చెందిన బోయ రాజు (20)కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి , రెడ్ క్రాస్ జిల్లా చైర్ పర్సన్ కాపు భారతి తమ సొంత డబ్బులను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, రాష్ట్ర BC సెల్ కార్యదర్శి NT సిద్దప్ప, గోవిందరాజులు, 32 వార్డుల అభ్యర్థులు, ఇంచార్జ్ లు, నాయకులు, అభిమానులు పాల్గొనడం జరిగింది.
R.ఓబులేసు,
అనంతపురం లైవ్ న్యూస్,