టీడీపీ మద్దతు దారుడు క్రిష్ణానాయక్ బుధవారం తన నామినేషన్ ఉపసంహరణ చేశారు
అదే రోజు సాయంత్రం తన భర్తకు వైఎస్సార్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు భయపెట్టి తన భర్తతో నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చేశారని దీంతో తన భర్త ప్రాణ భయంతో కనబడకుండా వెళ్ళిపోయారని అభ్యర్థి భార్య గాండ్లపెంట పోలీసులకు పిర్యాదు చేసారు.
పోలీసులు కేసు నమోదు చేసుకున్న కేవలం రెండు గంటల వ్యవధిలో రూరల్ సిఐ తమ్మిశెట్టి మధు ఆద్వర్యంలో కేసును చేదించారు.
అభ్యర్థి కృష్ణ నాయక్ మాట్లాడుతూ తమకు ఏ పార్టీ వాళ్లు కూడా భయపెట్టే లేదని తనకు గ్రామ పంచాయతీ ప్రజలు సహకారం ఇవ్వకపోగా దీంతో నామినేషన్ విత్డ్రా చేసుకున్నట్లు మీడియాతో తెలిపారు.