కడప ఉక్కు సాధన- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా- బైక్ ర్యాలీ

AP 39TV 15 ఫిబ్రవరి 2021:

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశాఖ ఉక్కు సాధన ఉద్యమంలో పాల్గొన్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్.ఎమ్ బాషా  జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పిబ్రవరిలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమను వందశాతం ప్రైవేటీకరించాలని తీర్మానం చేయడం ఆంద్రులకు ఆత్మగౌరవాన్ని పోస్కో వంటి విదేశీ ప్రైవేటు కంపెనీలకు దారధత్తం చేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమను ఎర్పాటు చెస్తామని ఇదే ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికి ఇదే బడ్జెట్‌లో ప్రస్తావన చేయకపోవడం ఆంధ్రులకు మరోసారి కేంద్రం మోసం   చేసిందన్నారు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు అవకాశ వాధ వైఖరితో ఊగులాడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని పూనుకుందన్నారు. 2014 లో రాష్ట్ర విభజన సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుంధెల్ ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చెస్తామని ఇచ్చిన హామి బుట్ట ధాఖలు చేశారు.అనంతపురం జిల్లాలో అనేక కేంద్ర పరిశ్రమలకు శంకుస్థాపన చేసినప్పటికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు అన్నారు.కరోనా సమయంలో ఉపాధి లేక వేలాదిమంది జిల్లాలో నిరుద్యోగులు ఉపాదికి దూరమయ్యారు అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థూల ఉత్పత్తిని ప్రపంచంలోని దేశాలకంటే మైనస్ గ్రోత్ ని సాధించిందన్బారు.కేవలం నరేంద్ర మోడీ దేశంలోని అంబానీ,అదానీ లాంటి వర్గాల ప్రయోజనాల కోసమే పని చెస్తుందన్నారు. ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి 32మంది బలిదానం చేసిన ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మడం అంటే ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడమే అన్నారు.రాష్ట్రంలో ఉన్న ప్రధాన అధికారి,ప్రతిపక్ష పార్టీల ఎంపిలు వీధులకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఏ ఉద్యమం అయినా విద్యార్థులు, యువజన, కార్మికుల పెద్ద ఎత్తున ఢిల్లీ రైతాంగ ఉద్యమ స్పూర్తితో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ బైక్ యాత్ర కార్యక్రమంలో సిఐటియీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.నాగేంద్ర కుమార్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరమేష్,సూర్యచంద్రయాదవ్,ఎస్ఎఫ్ఐ నాయకుడు అచ్యుత్ ప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బాలకృష్ణ, నూరుల్లా,సిఐటియీ నాయకులు పాండుయాదవ్,ముజిర్ బాషా,శీనా,నారాయణ,ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ,హరిష్,శివ,భూషన్, సంజీవ్,అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Comments (0)
Add Comment