Jubilee of Lord Macaulay
భారత శిక్షా స్మృతి సృష్టి కర్త మెకాలే మెగా సేవలు
అక్టోబర్ 25న లార్డ్ మెకాలే జయంతి
లార్డ్ మెకాలే పేరు వినగానే స్ఫురణకు వచ్చేది భారత దేశంలో ఆంగ్ల విద్యకు పునాది వేసిన వ్యక్తి. మెకాలే భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్ 1860) సృష్టికర్త కూడా. ఆయన లా కమిషన్ ఛైర్మన్ గా మూల రూపం గల ఐ పి సి చిత్తు ప్రతి తయారు చేశారు. 19వ శతాబ్దపు కవి, చరిత్రకారుడు, రాజనీతివేత్త, లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (1800 అక్టోబరు 25 .. 1859 డిసెంబర్ 28) జయంతి సందర్భంగా ఇండియన్ పీనల్ కోడ్ పూర్వా పరాలను తెలుసుకుందాం.
1837లో ఐపిసి కోడ్
లార్డ్ మెకాలే మహా మేధావి అయినా తన అభిప్రాయాల కంటే నాటి భారత దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆచార వ్యవహారాలకు విలువ ఇచ్చి వారి అభిప్రాయాలను గౌరవించారు. ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ – కౌన్సిల్ కి నివేదించినా 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. లార్డ్ మెకాలే తయారుచేసిన ‘చిత్తుప్రతి’ ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకతా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీ లించి, పరీక్షించాడు. అయన సుదీర్ఘ పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబరు 6 నాడు చట్టసభ ఆమోదం పొందింది.
అంగ్లేయుల వలస పాలన మూలాలు
ఇండియన్ పీనల్ కోడ్ మూలాలు 1860 నాటి ఆంగ్లేయుల వలస పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన 45వ చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి 1860 లో మొదటి లా కమిషన్ అజమా యిషిలో జరిగింది. మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే) మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. Jubilee of Lord Macaulay
విదేశాలలో మన ఐపిసి అమలు
పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ ను యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది. దాని పేరు “పాకిస్తాన్ పీనల్ కోడ్” (పి.పి.సి). బంగ్లాదేశ్ కూడా “బంగ్లాదేస్ పీనల్ కోడ్” పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్), మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా ఇండియన్ పీనల్ కోడ్ ను యధాతధంగా అమలు చేస్తున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము కాశ్మీర్లో కూడా అమలులో ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. “రన్‌బీర్ పీనల్ కోడ్” (ఆర్.పి.సి) అని పిలుస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే 1859 డిసెంబరు 28 న తన 59వ ఏట మరిణించారు. తాను రాసిన ఇండియన్ పినల్ కోడ్ చట్టమై అమలు జరగటం చూడనే లేదు. Jubilee of Lord Macaulay
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494