Journalist murder in UP ఉత్తర ప్రదేశ్ లో జర్నలిస్టు హత్య

caption]Journalist murder in UP ఉత్తర ప్రదేశ్ లో జర్నలిస్టును హత్య

ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్‌లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్, నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు తోలి నలుగురు రైతులను హత్య చేసిన సంఘటన‌లో ఒక జర్నలిస్ట్ కూడా అమరుడయ్యారు.

లఖింపూర్ ఘటన సమయంలో నిఘాసన్‌కి చెందిన జర్నలిస్ట్ రామన్ కశ్యప్ అదృశ్యమయ్యారు. జర్నలిస్ట్ మృతదేహాన్ని రాత్రి ఆసుపత్రిలో కనుగొన్నారు. అతను సాధనా న్యూస్ ఛానల్ జర్నలిస్ట్. సంఘటన స్థలానికి సంబంధించిన విజువల్స్ తీస్తుండగా వేగంగా వచ్చిన వాహనం వారిని ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయారు. రామన్ కశ్యప్‌కు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. చిన్న అమ్మాయి పాలు తాగే పసిపాప .

ఈ స్థానిక జర్నలిస్ట్ లు చాలా ఆగ్రహంతో వున్నారు.

* మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం యాభై లక్షలు పరిహారంగా యివ్వాలి!*
“హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల”ని బంధువులు డిమాండ్ చేశారు.
ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా ధీరజ్ గుప్తా, శిశిర్ శుక్లా సీనియర్ అధికారులతో సహా వందలాది మంది జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు, పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

M.V. Ramana TEMJ President

Journalist murder in UP/zindhagi.com/yatakarla mallesh
Comments (0)
Add Comment