‘‘వాస్తవం’’ వెబ్ సైట్ ఆధ్వర్యంలో క్యాలెండర్
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంపు ఆఫీస్ లో ‘‘వాస్తవం’’ క్యాలెండర్ ను బీఆర్ ఎస్ నాయకులు, ధర్ పల్లి జడ్ పిటీసీ బాజిరెడ్డి జగన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి లు ఆవిష్కరించారు.
సీనియర్ జర్నలిస్ట్ దండుగుల శ్రీనివాస్ ‘‘వాస్తవం’’ వెబ్ సైట్ నడుపుతున్నారు. పొలిటికల్ కరెంట్ ఇష్యూలపై సెటారికల్ స్టోరీలు ఇస్తూ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు.
‘‘వాస్తవం’’ వెబ్ సైట్ ఆధ్వర్యంలో తీసిన క్యాలెండర్ – 2023 ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ యాటకర్ల మల్లేష్, కేశపల్లి సర్పంచ్ మైదం మహేశ్వర్, జన విజ్ఞాన వేధిక నాయకులు కోయి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.