Inspirational Abdul Kalam స్పూర్తిదాత అబ్దుల్ కలాం

Inspirational Abdul Kalam
స్పూర్తిదాత అబ్దుల్ కలాం

అబ్దుల్ #కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి కూనూరు (ఊటీ) వెళ్లారు. అక్కడికి వెళ్లాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ శ్యాం #మానిక్ #షా అక్కడే ఓ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఆయన మన ఆర్మీ చీఫ్… తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని కలాం నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. మానిక్ షా పక్కనే చాలాసేపు కూర్చుని ఆరోగ్యస్థితిని కనుక్కున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తిరిగి వెళ్లిపోయే సమయంలో… ‘‘ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా..? నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా..? అడుగు మిత్రమా..?’’ అన్నారు కలాం.

‘‘ఓ అసంతృప్తి ఉంది సార్…’’ అన్నారు మానిక్ షా…

‘‘ఏమిటది..?’’ కలాం మొహంలో ఆశ్చర్యం…

‘‘నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు సెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్…’’ అన్నారు కళ్లు తుడుచుకుంటూ…

కలాం కళ్లల్లో కూడా తడి… షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా హత్తుకున్నారు.

‘‘సార్, చిన్న రిక్వెస్టు… ఇరవై ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు దగిన పెన్షన్ రావడం లేదు…’’ చెప్పారు షా..

కలాం ఢిల్లీ వెళ్లగానే చేసిన మొదటిపని… షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం..! తగిన ఆదేశాలు జారీచేయడం…! వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రెటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటీకి పంపించారు.

అదీ కలాం గారంటే…మానిక్ షా గారు మాత్రం తక్కువా… ఆ డబ్బు మొత్తాన్ని ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు దానం చేశారు… అదీ షా గారంటే… వావ్… ఎవరు ఎవరికి సెల్యూట్ చేయాలి..? ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ… ఇద్దరూ ఇద్దరే….భారతజాతి మొత్తం గర్వపడే నిజమైన భారతరత్నాలు.

సెల్యూట్
#AbdulKalam
#ManikShaw

అల్లూరి సౌజన్య 

Inspirational Abdul Kalam / zindhagi.com / yatakarla mallesh / abdul kaleem
Comments (0)
Add Comment