స్మశాన వాటికలో సౌకర్యాలు పెంచండి.

అనంతపురం.

హిందూ స్మశాన వాటికలో సౌకర్యాలు పెంచాలని అధికారులను నగర మేయర్ వసీం ఆదేశించారు. జె ఎన్ టి యూ రోడ్ లోని హిందూ స్మశాన వాటిక,క్రిస్టియన్ స్మశాన వాటికలలో మంగళవారం మేయర్ వసీం పర్యటించారు. ఈ సందర్భంగా హిందూ స్మశానవాటికలలో అంత్యక్రియలు జరుగుతున్న తీరు,అంత్యక్రియలను వసూలు చేస్తున్న నగదు గురించి మేయర్ ఆరా తీశారు.ప్రభుత్వం అంత్యక్రియలకు రూ.5200 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించిందని వాటికి మించి వసూలు చేయవద్దని అక్కడి సిబ్బందికి మేయర్ ఆదేశించారు. దీనిపై ప్రజలకు తెలిసేలా స్మశానవాటికలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులకు మేయర్ సూచించారు. అదే విధంగా స్మశానవాటికలో పచ్చదనం పెంచడం, అంతర్గత రహదారుల ఏర్పాటు, హైమాస్ లైట్లు ఏర్పాటు, స్నానపు గదుల నిర్మాణం వంటి సౌకర్యాలు వెంటనే చేపట్టాలని మేయర్ అధికారులను ఆదేశించారు.అదే విధంగా క్రిస్టియన్ స్మశాన వాటికలో పర్యటించిన అక్కడి నిర్వహణ తీరుపై అభినందించారు. ఏ మరణానికైనా రూ.2500 మాత్రమే అంత్యక్రియల కోసం వసూలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది మేయర్ కు వివరించారు. మేయర్ వెంట కార్పొరేటర్లు సంపంగి రామాంజనేయులు, అనీల్ కుమార్ రెడ్డి,వైకాపా నాయకులు ఖాజా,డిప్యూటీ కమిషనర్ రమణా రెడ్డి,డి ఈ రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment