తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో – శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి

AP 39TV 12ఏప్రిల్ 2021:

వైఎస్సార్ పార్టీకి ఓటేసి  అభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం అని శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. తిరుపతిలోని పురవీధుల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్లలో అమలుచేసిన సంక్షేమ పథకాల సాక్షిగా మీ అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. తిరుపతి వీధుల్లో, ప్రధాన రహదారులపై భారీ ర్యాలీగా ఎన్నికల ప్రచారం సాగింది.నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఆమె వెంట నడిచారు. ప్రజల దగ్గరికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు వివరిస్తూ  గ్రామ, పట్టణ, నగరాల అభివృద్ధిని చెబుతూ ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రచారం జోరుగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ముందెన్నడూ లేని విధంగా ప్రజా చైతన్యం అక్కడ కనిపించింది. ఎమ్మెల్యే వాహనంపై కాకుండా  రహదారులపై పాదయాత్రలా నడుచుకుంటూ పర్యటించడం పలువురిని ఆకర్షించింది. ఈ భారీ ర్యాలీలో పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిమంది పాల్గొన్నారు. శ్రీమతి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి  ఆధ్వర్యంలో, ప్రజల హర్షధ్వానాల మధ్య తిరువీధుల్లో సాగిన భారీ ర్యాలీ విజయవంతం కావడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.

 

Comments (0)
Add Comment