AP 39TV 07ఏప్రిల్ 2021:
48 వ వార్డు ప్రచారంలో భాగంగా సత్యనారాయణ పురం, సాయినగర్ రాజీవ్ నగర్ ఏరియా లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు ప్రభుత్వ వ్యతిరేక పాలన గురించి, అధిక ధరలు ప్రజలు పడుతున్న కష్టాలు అందరికీ వివరించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి ని గెలిపించి తిరుపతి అభివృద్ధికి సహకరించ వలసినదిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిరుమల నాయుడు, శ్రీరాములు విజయ్, వెంకట రమణ ఆచారి (చారి), ప్రమీలమ్మ, లత, లలిత, కిన్నెర సాయి, టీడీపి నాయకులు దేవర్ల మురళి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.