Immortal love

మరణం లేనిది ప్రేమ

ప్రేమంటే ఒక ఆకర్షణ కాదు
ప్రేమంటే రెండు హృదయాల స్పందన కాదు

తడిఆరని కన్నుల తనువెల్లా పులకింపజేసేది
గుండెలోతుల్ని కూడా ఆత్మీయతతో తడిపి ముద్దాడేది

యుగాలు ఎన్ని మారినా
తరాలెన్ని జనించినా
విశ్వమంత పరుచుకున్న ప్రేమకు వయసే లేదు
వార్థక్యం అంతకంటే రాదు
దాచలేనంత విశాలమైనది
వెలకట్టలేనంత విలువైనది

ప్రేమంటే అలుగుతుంది
ప్రేమంటే బతిమిలాడుతుంది
ప్రేమంటే ఏడుస్తుంది
ప్రేమంటే కన్నీళ్ళు తుడుస్తుంది
ప్రేమంటే శాసిస్తుంది
ప్రేమంటే శ్వాసిస్తుంది

నిజాయితీ తోడైతే నిత్యం కష్టాలను భరిస్తుంది
సత్యం చెబితే మహ బాగా సంబుర పడుతుంది
మరణించే వరకు మనిషిని బ్రతికించేది ప్రేమ
ఎప్పుడూ మరణం లేనిది కూడా ప్రేమే…

మచ్చరాజమౌళి
దుబ్బాక, 9059637442

Immortal love / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment