మానవత్వం పరిమళించిన వేళ…!

మానవత్వం పరిమళిస్తే
మనిషితనం పురివిప్పితే
మంచితనం చేయందిస్తే
లోకంలో అనాథలెవ్వరు?

మనిషి మానవత్వం మరిచాడు. తనలో వున్న
మనిషితనాన్నీ మరిచాడు.ఆసలు తాను మనిషి
నన్న సంగతినే మరిచిపోయాడు.మనిషిగామాయ
మైపోయాడు..సాటి మనిషిని,తోటి వారిని లెక్క..
చేయడం మానేశాడు..ఇరుగూ పొరుగూ సంగత
లావుంచితే..పక్కన వున్నోడ్ని కూడా పట్టించు
కోవడంలేదు..కారణం స్వార్ధం.! స్వాతిశయం..!!

ఆపదలో వున్నవాళ్ళని ఆదుకోవాలన్నారు మన
పెద్దలు..ఆర్ధికస్తోమతలేకుంటే కనీసం మన చేత
లతో,మాటలతో అయినా సాయం చెయ్యొచ్చు…
కానీ, పక్కమనిషి ఆపదలో వుంటే కూడా మనకెం
దుకులే అని చూసీ,చూడకుండా పోతాం.ఆరడు
గుల మనిషిలో,గుప్పెడు గుండెలో ఆర్తులపట్ల…
కూసింత దయ, ప్రేమ లేకుండా వ్యవహరిస్తాం..!

అదే జంతువుల్ని,పక్షుల్ని చూడండి..తమ జాతి
సాటి వాళ్ళు బాధల్లో,ఇబ్బందుల్లో వుంటే ఎంతగా
అల్లాడిపోతాయో? వెంటనే రంగంలోకి దిగితమకు
చేతనైనంత సాయం చేస్తాయి..ఆదుకుంటాయి.!!

మరి ఈ మనేషేంటండంటి బాబు,కించిత్ మాన
వత్వం కూడా లేకుండా రాయిలా మారిపోయా
డు.మనిషంటేనే స్పందన కదా..మనిషంటేనే.. ప్రేమకదా! మరి అవేం లేకుండా ఎందుకిలా జడంలా మారాడు..?

అయితే..ఇంకా గుండె తడి ఆరని మహానుభావు
లునూటికో కోటికో ఒకరిద్దరుంటారు.వాళ్ళు ఆర్తు
లబాధల్ని అర్ధం చేసుకుంటారు.తమకు చేతనైనం
త సాయంచేస్తారు.‌ఇలాంటి వాళ్ళను చూసినప్పు
డు మానవత్వంపై ‘ఆశ’ చిగురిస్తుంది. మనిషి
తనంపై ‘నమ్మకం’కలుగుతుంది..అటువంటి ప్రేమ
స్వరూపులకు,దయార్ద్ర హృదయులకు….
శత కోటి దండాలు..!!

ఉన్నదొక్కటే జీవితం..అందరితో కలిసిమెలిసి వుండి,అవసరం వున్న సాటివారికి చేతనైనంత
సాయం చేస్తేకదా! ఈ మానవజన్మకు అర్ధం…
పరమార్ధం…

అందరూ బాగుండాలి..అందులో మనం వుండాల
ని అనంకున్న రోజునే, మనిషి…మనిషిగా మన
గలుగుతాడు..మనిషి అనిపించుకుంటాడు…
మానవసేవయే మాధవ సేవ యని ఊరకే…..
అన్నారా!

*ఎ.రజాహుస్సేన్..!!

Comments (0)
Add Comment