కొట్లాడకుండా ముందుగానే కాంగ్రెసోళ్ల అరెస్టులు

కొట్లాడి తెలంగాణ తెచ్చినోణ్ణి నేను.. అధికారం చలాయించాల్సింది నేనే గదా.. మరీ గీళ్లు ఉద్యమాలు చేసుడేంటి..? గీ జనంకు మా గురించి చెప్పుడేంది అనుకున్నాడెమో మన సీఎం కేసీఆర్.. గియ్యళ్ల 2జనవరి 2023 నాడు హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసే కాంగ్రెసోళ్లనందరిని అరెస్టు చేస్తుండ్రు పోలీసులు.

సర్పంచ్ ల సమస్యలపై కాంగ్రెస్ సై..

ఔను.. రోజు సీనియర్ – జూనియర్ పేరుతో కుమ్ములాడే కాంగ్రెస్ పార్టోళ్లు సర్పంచ్ ల సమస్యలపై కొట్లాడాలనుకున్నారు. ఇగో స్టేట్ వైజ్ గా ఉన్న సర్పంచ్ లు, కాంగ్రెస్ లీడరులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ రావాలని నిన్న, మొన్నటి నుంచే చెప్పుతుండ్రు.

ఇంకేం.. బీఆర్ ఎస్ పార్టోళ్లు ఊకుంటారా..? గిట్ల సర్పంచ్ లతో ధర్నా చేస్తే మా ఇజ్జత్ ఏమి కావాలనుకున్నారో ఏమో సీఎం కేసీఆర్ పోలీసులను గియ్యళ్ల తెల్లవారు జామునుంచి కాంగ్రెసోళ్ల ఇండ్లళ్లకు తోలించిండు. పొద్దున్నుంచి కాంగ్రెస్ లీడరులను అరెస్ట్ లు చేస్తుండ్రు. కాంగ్రెస్ స్టేట్ లీడర్ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఇంటి వద్ద హౌజ్ అరెస్ట్ చేసి బయటకు పోకుండా పోలీసులు ఆడనే కాపాల కాత్తుండ్రు. మల్లు రవిని, మహేష్ కుమార్ గౌడ్ ను, అద్దంకి దయాకర్ లనుఅరెస్టు చేసిండ్రు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గీ ధర్నా చౌక్ కు వస్తుంటే అరెస్ట్ చేసిండ్రు.

రేవంత్ రెడ్డి కోపంకు వచ్చిండు..

ఇగో మేమంతా సర్పంచ్ లు బాధ పడుతున్నారని ధర్నా చేస్తుంటే కేసీఆర్ పోకడేందని ప్రశ్నిస్తుండు కాంగ్రెస్ పార్టీ స్టేట్ బాస్ రేవంత్ రెడ్డి. గీ ప్రభుత్వం చేస్తున్న గాలీద్ పనులను పబ్లిక్ కు చెబుదామంటే ధర్నా చేసుకోకుండా అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. గీ పోలీసుల అక్రమ అరెస్టు లకు నిరసనగా స్టేట్ వైజ్ గా ఎక్కడికక్కడే ధర్నాలు చేసి కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేయాలని పిలుపు నిచ్చిండు.

  • వయ్యామ్మెస్ ఉదయశ్రీ, హైదరాబాద్
House arrests Congress leaders / congress party / pcc chief Revanth reddy
Comments (0)
Add Comment