AP 39TV 30 ఏప్రిల్ 2021:
ఒడిశాలోని కులాంగే జిల్లా పరిధిలోని ఓ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి పీపీఈ కిట్ ధరించి వెళ్లారు ఐఏఎస్ ఆఫీసర్ విజయ్. అందరూ భయంలో, బాధలో, వేదనలో ఉన్నారు. అందరికీ ధైర్యం చెబుతూ వెళ్లిన విజయ్. ఓ బెడ్ దగ్గర సడన్ గా ఆగిపోయారు.ఆ బెడ్ పై కూర్చున్న కొవిడ్ బాధితుడు సీరియస్ గా తనపని తాను చేసుకుంటున్నాడు. అతని చుట్టూ పుస్తకాలు ఉన్నాయి. ఓ కాలిక్యులేటర్ ఉంది. చేతిలో పెన్నుతో ఏవేవో రాసుకుంటున్నాడు.ఇది చూసిన ఐఏఎస్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వివరాలు ఆరాతీస్తే. అతడు ఓ చార్టెడ్ అకౌంట్ విద్యార్థిగా తేలింది. ఆ విద్యార్థి తాను రాయాల్సిన సీఏ పరీక్ష కోసం చదువుతున్నాడు. అతనికి కొవిడ్ వచ్చిందన్న బాధే కాదు. అసలు ఆలోచన కూడా లేకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఐఏఎస్ అతన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు.ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు సదరు ఐఏఎస్. గుండె ధైర్యంతో నిలబడడం. భవిష్యత్ పై ఆశాభావంతో ఉండడమే కరోనాకు సరైన మందు అని ట్వీట్ చేశారు. నిజంగా ఇతడు కొవిడ్ బాధితులందరిలో తప్పకుండా స్ఫూర్తి నింపుతాడని చెప్పడంలో సందేహమే లేదు.