AP 39TV 15 ఫిబ్రవరి 2021:
రాయదుర్గం పట్టణంలోని బైల ఆంజనేయస్వామి సమీపంలో ఉన్న హిందూ స్మశాన వాటిక స్థలాన్ని సమీపంలోని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం గా పెట్టుకొని అక్రమానికి గురి చేశారు ఈ విషయాన్ని గమనించిన రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ప్రజలు భారీ ఎత్తున హిందూ స్మశాన వాటిక ను పరిశీలించారు గత రెండు రోజుల కిందట సమీపంలోని యజమానులు దురాక్రమణకు గురిచేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్మశానం లో మూడు వందల మంది పైగా సమాధులను తొలగించి భూ కబ్జా చేసినట్లు గుర్తించి ఆవేదన చెందారు. అనంతరం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం లో నిరసన వ్యక్తం చేశారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ సమీపంలోని కొంత మంది యజమానుల వాళ్ళ సమాధులు తొలగించి స్మశానాన్ని కబ్జా చేయడం సమంజసం కాదని మండిపడ్డారు.వెంటనే స్పందించి సర్వే చేయించి కబ్జాకు గురైన భూమి లో అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. నాలుగు ఎకరాల భూమిని దాదాపు ఒకటిన్నర ఎకరా కబ్జాకు గురైనట్లు ఆవేదన చెందారు అనంతరం తమ డిమాండ్ల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద, చందన .రామాంజనేయులు. మల్లికార్జున. ఉప్పు శ్రీనివాసులు, డిష్ గోవిందు, నాయకుల నాగయ్య,వెంకటేశ్వర్లు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇంచార్జి.