ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి గుడిబండ మండల ఎస్ఐ సుధాకర్ యాదవ్

సేవాతత్పరుషుడు, మానవతావాది నిత్యం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి గుడిబండ మండల ఎస్ఐ సుధాకర్ యాదవ్

ఏపీ39టీవీ న్యూస్ మే25
గుడిబండ:- స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రజల బాగోగుల కోసం ఒక అడుగు ముందుకేసి ప్రతి ఒక్క చోట కరోనా కేసులు పెరుగుతుండడంతో గుడిబండ మండలంలో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ను ఏర్పాటు చేయాలని జిల్లా SP శ్రీ సత్య యేసుబాబు గారికి,పెనుకొండ RDO గారికి ,సంబంధిత మండల MPDO అధికారులకు విషయం తెలియజేయగా వాళ్లు సానుకూలంగా స్పందిస్తూ… జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ గారు కూడా మంచి ఆలోచన అని కచ్చితంగా ఇది అమలు చేయాలని ప్రతి మండలంలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయితీలో కూడా COVID ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి కరోనా కేసులను తగ్గించాలని జిల్లా కలెక్టర్ నేడు ఉత్త్వరులు జారీ చేశారు.
కలెక్టర్ శ్రీ గంధపు చంద్రుడు ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆలోచనలను మెచ్చుకొని ఆయనను అభినందిస్తూ మంచి ఉన్నతమైన ఆలోచనలకు సేవా గుణానికి మండల అధికారులు గ్రామ ప్రజలు పలువురు అభినందించారు.
ఆయన ఆధ్బుతమైన ఆలోచనలకూ ప్రభుత్వం నాంది పలికింది.
ఎస్ఐ సుధాకర్ యాదవ్ గతంలో కూడా చాలా మందికి వైద్య పరంగా,ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న వారికి, మరియు చదువుకు సంబంధించి విద్యార్థుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతో మందికి అండగా నిలిచారు. నేటి యువతకు ఆయన ఒక స్పూర్తి మాత్రమే కాదు ఆదర్శం కూడా.
ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల బాగోగుల కోసం శ్రమించి ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు కదలాలనీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ మరొక్క సారి హృదయా పూర్వకంగా మండలంలోని పలువురు ఆయనను అభినందిస్తూ కొనియాడారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment