ఏపీ 39టీవీ 11 ఫిబ్రవరి 2021:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం డీఎస్పీ వీర రాఘవ రెడ్డి, ఆత్మకూరు సి.ఐ కృష్ణారెడ్డి, ఎస్సై శంకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూరు మండలం మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజలతో మాట్లాడారు.
* స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన
* ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కగా పాటించాలి.
* ఎన్నికల వేళ అల్లర్లకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవు
* ఎన్నికల నియమ నిబంధనలు గురించి ప్రజలకు అవగాహన
*ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి
*ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, తదితర అక్రమాలకు పాల్పడరాదు
* అల్లర్లు, గొడవలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.