కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి

ఏపీ 39 టీవీ,
మార్చి- 10,

రాయదుర్గం మేజర్ న్యూస్:-రాయదుర్గం పట్టణంలో 11 వార్డు పోలింగ్ కేంద్రం లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, అలాగే రాయదుర్గం పట్టణ ప్రజలు సమాచారం మేరకు మున్సిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపిస్తార ని ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా వై ఎస్ ఆర్ సి పి నే మొత్తం వార్డు కౌన్సిలర్లు అభ్యర్థులే కైవసం చేసుకోబోతోంది అని మాకు అందిన సమాచారం. పట్టణ ప్రజలు ప్రేమానురాగాలు ఎప్పుడు ఉంటాయని, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తెలియజేశారు. రాష్ట్రమంతటా కూడా వైఎస్సార్సీపీనే కైవసం చేసుకోబోతోంది అని, ఇక తెలుగుదేశం పార్టీ శని వీడిపోతుంది అని విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి, కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి, కాపు అలేఖ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

R.ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Comments (0)
Add Comment