జర్నలిస్ట్ లకు శుభవార్త
త్వరలో ఇళ్ల స్థలాలు
జర్నలిస్ట్ లకు తెలంగాణ ప్రెస్ అకాడమీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల మంత్రి కేటీఆర్ ను ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్ట్ లు విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. జర్నలిస్ట్ యూనియన్ లు ఇప్పటికే ఉద్యమం చేయడానికి సిద్దమయ్యాయి కూడా.
అయితే.. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇళ్ల స్థలాల విషయంలో మొదటి నుంచి సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే.. త్వరలో ఇళ్ల స్థలాలు జర్నలిస్ట్ లకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దమైందని పేర్కొన్నారు ఆయన. ఎడిటర్స్.. బ్యూరో ఇన్ చార్జీలు.. సీనియర్ జర్నలిస్ట్ లు.. జర్నలిస్ట్ యూనియన్ లతో చర్చలు జరిపిన తరువాత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.