Glorious Vaishnavism Sri Book
వైభవంగా వైష్ణవి శ్రీ... ” అటుగా వంగిన ఆకాశం “
కవితా సంపుటి ఆవిష్కరణ…!!
మనుషుల్లో వున్న దూరాన్ని చెరిపేయడానికి పుస్తకాల అవసరం ఎంతో వుందన్నారు ప్రముఖకవి, కవిసంగమప్రవక్త డాక్టర్ యాకూబ్. సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక ప్రదర్శనశాలలోని కాళీపట్నం రామారావు సాహిత్య వేదికలో జరిగిన వైష్ణవి శ్రీ తాజా కవితాసంపు టి ” అటుగా వంగిన ఆకాశం ” ఆవిష్కరణ కార్యక్రమంలోఆయన ప్రసంగించారు.
సోషల్ మీడియాను సద్వినియోగం చేసేందుకు అందరూ కృషిచేయాలన్నారు. కవిత్వం కదిలిస్తుంది.కవిత్వం బతుకు పాఠాన్ని నేర్పుతుంది. కవిత్వం నిన్ను నీవు తెలుసు కోటానికి ఉపయోగపడుతుంది. నిన్ను నీవు తెలుసు కుంటే లోకాన్ని తెలుసుకోటానికి ఉపయోగపడుతుందన్నారు. “కవిత్వం నాకొడుకును నాకు తిరిగి అప్పగించింది. కవిత్వం ఏం చేసిందనడానికి నేనే సజీవ సాక్ష్యం” అన్నారు.కవిత్వం కులమతాలు, ప్రాంతీయ భేదాలతో రగులుతున్న కార్చిచ్చును కవిత్వం ఆర్పేస్తుంది. సమసమాజ భావన కలిగిస్తుందన్నారు. వైష్ణవిశ్రీ తొలి కవిత దగ్గర్నుంచి నేటివరకు రాస్తున్న కవితల్ని చూస్తే ఆమె భవిష్యత్తులో ప్రామిసింగ్ కవి అవుతుందనడంలో సందే హం లేదన్నారు. కవిత్వం చాలామంది రాస్తారు కానీ.. అందులో మెరుగ్గా రాసే వైష్ణవి శ్రీ లాంటి వారు బహు అరుదుగా వుంటారు న్నారు.గొప్ప సమాజం రావాలంటే కార్మికుల్లా పనిచేసే బుద్ధి జీవులు రావాలన్నారు. పాఠకుల్ని చైతన్యం చేస్తున్న వైష్ణవి శ్రీ లాంటి కవులు చాలా మంది రావాలని అన్నారు.. పుస్తకం వర్థిల్లాలి, సాహిత్య కారులు వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
వైష్ణవిశ్రీ ” అటుగా వంగిన ఆకాశం ” కవితా సంపుటిని నరసం( నవ్యాంధ్ర రచయితల సంఘం ) అధ్యక్షురాలు తేళ్ళ అరుణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వైష్ణవిశ్రీ కవితా సంపుటి శీర్షిక విభిన్నంగా వుందన్నారు. నరసం తరపున అరణ్య కృష్ణ గారి స్త్రీ వాద కవిత్వం తొలి ప్రచురణ గా తెచ్చామన్నారు. వైష్ణవిశ్రీ కవిత్వం అటుగా వంగిన ఆకాశం మూడో ప్రచురణ అన్నారు.”ప్రకృతికైనా విశ్రాంతి వుంది కానీ…అమ్మకు ఎప్పుడూ విశ్రాంతి లేదు” . గృహిణి కి వంటిల్లే ఐసోలేషన్ సెంటర్ ” అన్న వైష్ణవి శ్రీ కవిత్వం భావనలు గొప్పగా వున్నాయన్నా
రు.స్త్రీ శక్తికి చిహ్నంగా నరసం ఆవిర్భవించింద న్నారు. అభ్యుదయం ప్రధానంగా ఈ సంస్థను నడుపుతున్న మన్నారు. పిల్లల్లోకి సాహిత్యంవెళ్ళాలి. బాలలదగ్గరకు సాహిత్యం తీసుకు వెళ్ళడం నరసం లక్ష్యమన్నారు. అరు ణగారి ఉద్వేగ ప్రసంగంఆహూతులనుఆకట్టుకుంది. Glorious Vaishnavism Sri Book
సభకు అధ్యక్షత వహించిన కవి అరణ్య కృష్ణ మాట్లాడుతూ, సమాజంలో జరిగే పరిణామాలను పరిశీలించి కవిత్వంచేసే కవులు బహు అరుదు. వారిలో వైష్ణవి శ్రీ ముందువరుసలో వుంటారని అన్నారుగత కొంతకాలంగా కవిత్వంలో వడివడిగా అడుగులువేసుకుంటూ సాహితీ లోకంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. సభలో వైష్ణవి శ్రీ తాజా కవిత్వం ‘అటుగా వంగిన ఆకాశాన్ని’ కవి బండ్ల మాధవరావు సమీక్షించారు.
“లుథియానా వీథుల్లో
రూథర్ ఫర్డ్ సంస్కరణల్లో
నిర్భయ..చట్ట..పొలికేకల్లో
సినిమా ప్రారంభానికి ముందు స్లోగన్ లా
నేనొక హత్యచేయబడ్డ జాతీయగీతాన్ని
పిచ్చగా నచ్చావంటూ
పచ్చిగా మాట్లాడే నాలుకలు తెగ్గోసి
నఖశిఖ పర్యంతం
కామవాంఛ ప్రేరేపితాలతో
మదమెక్కిన మృగాలను
జీవశాస్త్రం పేరు చెప్పి ప్రయోగశాలలో
గొంతు నిండా యాసిడ్ పోసి పరిశీలించాలిప్పుడు
అప్పుడు కదా మరణించిన
నిర్భయ..అభయలెందరో రోదనలు
వాడి చెవినిండా రణభేరి నాదమై వినిపించేది
ఆడతనం అణకువంటూ నీతులు నేర్పే తల్లుల్లారా
నేటి సమాజంలో బ్రతకాలంటే
ఓర్పు అణకువలే కాదమ్మాక్త
మానప్రాణ సంరక్షణకై ..
వీలైతే కత్తిసాము నేర్పి
ఇంటింటికో లక్ష్మీబాయిని
తయారుచెయ్యండి
తుపాకి చేతబట్టి చీడపురుగుల
మట్టుబెట్టే బుల్లెట్ లా పెంచండి
విల్లుచేతబట్టే వీరంగనలకు
జన్మనివ్వాలని కోరుకోండి
నిర్భయంగా భరతమాత గుండెకు
స్వేచ్ఛావాయువును నింపుతూ జాతీయగీతం పాడుకుందామప్పుడు ఇంటింటికీ…
ఆడపిల్ల కలలు నిర్భయంగా
వీధివీధిలో ..గిరిజన వాడల్లో విప్లవగీతం
పాడుకుంటాయప్పుడు
వినోదాన్ని కాను నేను
వేదాన్ని ..నాదాన్ని..మోదాన్ని..నిర్భయ నినాదాన్ని నేనంటూ..”…”!! (వైష్ణవి శ్రీ)
ఈ కవిత చదివితే స్త్రీ వాద కవిత్వంలో ఓ బలమైన స్వరం వైష్ణవి శ్రీ అనిపించక మానదన్నారు. బండ్ల మాధవరావు.
ఎక్కడ అణచి వేతవుంటుందో.. దాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించడం వైష్ణవిశ్రీ ప్రత్యేకత అన్నారు. సమాజంలో ఎటువంటి వారినైనా తన కవిత్వంలోకి తీసుకొని, వారి బాధల్ని ,గాధల్ని విశ్లేషించడాన్ని వైష్ణవి శ్రీ కవిత్వంలో గమనించ వచ్చన్నారు.ప్రతీ సామాజిక కల్లోల స్వరాన్నికవిత్వం చేయడం వైష్ణవి శ్రీ కే చెల్లిందన్నారు.రుతువిరతి కవితను విశ్లేషిస్తూ…స్త్రీలలో సహజంగా జరిగే పరిణామాలను, అప్పటి స్త్రీల మానసిక ఒత్తిడిని,పరిస్థితుల్ని వైష్ణవి శ్రీ చాలా చక్కగా కవిత్వీకరించారన్నారు. Glorious Vaishnavism Sri Book
మందవరపు హైమవతి (నీలి గోరింటాకు)గారు మాట్లాడుతూ.. వైష్ణవి శ్రీ దేన్నయినా కవిత్వం చేయగల కవయిత్రి అన్నారు..సామాజిక సమస్యల్ని తీసుకొని పదునుగా, సూటిగా కవిత్వీకరిస్తారన్నారు.
తొలి కవితా సంపుటి ఏడవరుతువు నుండి దేశమంతా వాళ్ళ వూరు, ఇప్పుడు అటుగా వంగిన ఆకాశం కవితా సంపుటులు వైష్ణవి శ్రీ కవితా పరిణామాన్ని సూచిస్తు న్నాయన్నారు.రొతులమీద వైష్ణవి శ్రీ రాసిన కవితను చదువుతూ..రైతు సమస్యలకు అద్దంపడుతోందన్నారు.
స్త్రీల హక్కులకు సంబంధించి వైష్ణవి రాసిన కవిత.
“ఐదూళ్ళిచ్చినా చాలదు,యావద్దేశంలో సగం అడుగులు మాకు కావాలి” అంటూ రాసిన కవిత చాలా గొప్పగా వుందన్నారు.
సభ చివర్లో కవయిత్రి వైష్ణవి శ్రీ మాట్లాడుతూఅతిథులకు, ఆహూతులకు కృతజ్ఞతలు తెలిపారు.తన కవిత్వాన్ని ప్రచురించినందుకు నరసానికి ధన్యవాదాలు తెలిపారు. కవిత్వంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను. ఇంకా మంచి కవిత్వం రాయాలని వుందన్నారు.ప్రజాశక్తిలో
చదువుకున్న పాఠాలే తన కవిత్వానికి స్ఫూర్తి అన్నారు. Glorious Vaishnavism Sri Book
లైవ్ రిపోర్టింగ్..
ఎ.రజాహుస్సేన్
విజయవాడ నుండి..!!