Girls Science Month
బాలిక సైన్స్ మాసోత్సవం
పిల్లలలో దాగిన ప్రతిభను వెలికి తీయడానికి విజ్ఞాన దర్శిని నడుం బిగించింది. ప్రఖ్యాత వైజ్ఞానిక వేత్త మేడమ్ క్యూరీ జన్మదినం నవంబర్ 7వ తేదీ సందర్భంగా నవంబర్ నెలను “బాలిక సైన్స్ మాసోత్సవం”గా విజ్ఞాన దర్శిని జరుపుతుంది. అన్నిట్లో సగభాగంగా ఉన్న మహిళల భాగస్వామ్యం లేక పోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఆధునిక యుగంలో సైన్స్ రంగాల్లో మహిళలను ప్రొత్సహించడానికి బాలిక సైన్స్ మాసోత్సవం నిర్వహిస్తున్నారు. సైన్స్ రంగాలలో మహిళల భాగస్వామ్యం తక్కువకు కారణాలు ఏమిటి? సైన్స్ రంగంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? అనే అంశాలపై లైవ్ చర్చాలు నిర్వహిస్తోంది విజ్ఞాన దర్శిని. ఇంట్రెస్ట్ ఉన్న వారు 9948644206, 9290445693 కాల్ చేయాలని నిర్వహకులు కోరుతున్నారు.
రమేష్, విజ్ఞాన దర్శిని